
దంపతులు మంగళ, నారాయణస్వామి(ఫైల్)
మండ్య: భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను దారుణంగా హత్య చేసిన భర్త ఉదంతం గురువారం మండ్య జిల్లాలోని పాండవపురలో చోటు చేసుకుంది. పాండవ పుర పట్టణంలో నారాయణ, మంగళ(33) దంపతులు నివాసం ఉంటున్నారు. మంగళ స్థానికంగా ఉన్న ఇందిరా క్యాంటిన్‌లో పనిచేసేది. కొంతకాలంగా మంగళపై నారాయణ అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. ఈక్రమంలో గురువారం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి నిద్రస్తున్న మంగళను నారాయణ బండరాతితో బాది ఉడాయించాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న మంగళను స్థానికులు గుర్తించి మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నారాయణను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment