ఘటనా స్థలంలో హయతున్నీసా మృతదేహం
నరసరావుపేటరూరల్: భార్యభర్తల మధ్య చోటు చేసుకున్న స్వల్పవివాదం భార్య హత్యకు దారితీసింది. పురపాలక సంఘం పరిధిలోని బరంపేట కాసు బ్రహ్మనంద ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షేక్ హయతున్నీసా(35) తన భర్త ముస్తఫా చేతిలో దారుణ హత్యకు గురైంది. క్రికెట్ బ్యాట్‌తో తలపై దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... నగరం మండలం చినమట్లపూడి గ్రామానికి చెందిన షేక్ హయతున్నీసాకు తన సమీప బంధువైన నిజాంపట్నానికి చెందిన ముస్తఫాతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమా రుడు ఉన్నాడు. ఆరు నెలల కిందట ఉద్యోగ బదిలీలలో భాగంగా హయతున్నీసా నరసరావుపేటకు వచ్చి సత్తెనపల్లి రోడ్డులోని సాయినగర్ 4వ లైన్‌లోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. భర్త ముస్తఫాకు ఉద్యోగం లేకపోవడంతో గతంలో ఇన్నోవా వాహనాన్ని బాడుగులకు నడిపే నిమిత్తం కొనుగోలు చేసింది. అయితే ఇందులో ముస్తఫాకు నష్టాలు వచ్చా యి. తర్వాత రూ.2లక్షల పెట్టుబడితో వస్త్ర వ్యాపారం మొదలుపెట్టించింది. ఈ వ్యాపారంలోను నష్టాలు రావడంతో భార్యభర్తల మధ్య వివాదం మొదలైంది.
తనకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే హయతున్నీసా కుటుంబానికి దూరంగా బదిలీ చేయించుకుందని ముస్తఫా భావించాడు. ఈ నేపథ్యంలో ఆరు నెలల కిందట నుంచి హయతున్నీసా నరసరావుపేటలో నివాసం ఉంటున్నప్పటికీ ముస్తఫా మాత్రం ఇక్కడకు రాలేదు. నెల రోజుల కిందట పెద్దమనుషులు ఇరువురి మధ్య రాజీ చేశారు. అప్పటి నుంచి ఇరువురు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి దంపతులు ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ముస్తఫా ఆవేశంతో అందుబాటులో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో భార్య హయతున్నీసా తలపై దాడి చేశాడు. తలకు తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం ఆమె తలకు ప్లాస్టిక్ కవరు చుట్టి హత్యకు పాల్పడ్డాడు. ముస్తఫా తన కుమారుడు రజాను తీసు కుని పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. క్లూస్ టీమ్ రప్పించి ఆధారా లు సేకరించారు. డీఎస్పీ వీరారెడ్డి, సీఐలు బిలాలుద్దిన్, కృష్ణయ్య, అచ్చయ్య, ఎస్‌ఐలు బ్రహ్మం, నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment