కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గొల్ల సరళమ్మ(30)కు శెట్టూరు మండలం యాటకల్లుకు చెందిన గొల్ల రామచంద్రతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు యోగానంద, గోవర్ధన్, కుమార్తె చైత్ర ఉన్నారు. చెడువ్యసనాలకు అలవాటుపడిన రామచంద్ర అందినకాడల్లా అప్పులు చేశాడు. ఈ క్రమంలో భార్య ఒంటిపై ఉన్న నగలు కూడా తాకట్టు పెట్టి నగదు తెచ్చుకుని జూదంలో కోల్పోయాడు.