Husband Kills Wife After Heated Argument About Financial Issues In Guntur - Sakshi
Sakshi News home page

Guntur Crime: గుంటూరులో దారుణం.. బ్యూటీపార్లర్‌లో భార్యను చంపి.. దండేసి పోలీస్‌ స్టేషన్‌కు..

Published Thu, Nov 17 2022 4:30 PM | Last Updated on Thu, Nov 17 2022 5:38 PM

Husband Kills wife After Heated Argument in Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. స్థానిక గాంధీనగర్‌లో భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. స్వాతి అనే మహిళ బ్యూటీ పార్లర్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. అప్పులు తీర్చేందుకు భార్య పేరున ఉన్న స్థలాన్ని అమ్మాలని భర్త కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి స్వాతి అంగీకరించలేదు. ఇవాళ బ్యూటీపార్లర్‌కు వచ్చిన కోటేశ్వరరావు స్థలం విషయంలో మరోసారి భార్యతో గొడవపడ్డాడు.

ఈ క్రమంలోనే ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో స్వాతి తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం భర్త వెంకటేశ్వరరావు పూలదండలు తీసుకొచ్చి భార్య మెడలో వేసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయడు. ​వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అటుతల్లి చనిపోవడం, తండ్రి జైలు పాలవడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. 

చదవండి: (మీర్‌పేట్‌లో దారుణం.. వివాహితపై ఎస్‌బీ కానిస్టేబుల్‌ అత్యాచారం) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement