
ప్రతీకాత్మక చిత్రం
క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి తనకు దూరంగా ఉంటుందనీ..
నోయిడా : శృంగారానికి నిరాకరించిందని ఓ క్యాన్సర్ రోగి, తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు. గత బుధవారం నోయిడాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడు అజయ్ అలియాస్ మహేశ్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వివరాలను మీడియాకు తెలిపారు.
లలిత్‌పూర్‌కు చెందిన అజయ్ అలియాస్ మహేశ్(40)కు జాలాన్‌కు చెందిన మమత(36)కు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి ఇద్దరు పిల్లలు సాక్షి(15), సందీప్ (12)లతో లలిత్‌పూర్‌లో నివసిస్తున్నారు. అయితే ఆరు నెలల క్రితం మహేశ్‌కు నోటి క్యాన్సర్ రావడంతో అతను ఏం పనిచేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. అతని భార్య నోయిడాలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. అయితే క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి మహేశ్‌కు మమత దూరంగా ఉంటుంది. ఈ దూరంతో అభద్రతా భావానికి లోనైన అతను ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 11న మమత తన తమ్ముడు రాహుల్ ఇంటికి వెళ్లింది. మహేశ్ కూడా చెప్పపెట్టకుండా అక్కడికి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే శృంగారంలో పాల్గొనాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు కోసి హతమార్చాడు.