భార్యను రోకలిబండతో మోది హత్య | Husband Killed Wife In Guntur | Sakshi
Sakshi News home page

భార్యను రోకలిబండతో మోది హత్య

Published Fri, Jun 8 2018 1:18 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Husband Killed Wife In Guntur - Sakshi

హత్యకు గురైన రమ్యకృష్ణ (ఇన్‌సెట్‌లో) నిందితుడు కోటేశ్వరరావు

చేబ్రోలు: భార్య తలపై రోకలిబండతో మోది హతమార్చిన ఘటన చేబ్రోలులో గురువారం కలకలం రేపింది. చేబ్రోలుకు చెందిన కొరగంటి కోటేశ్వరరావు నిజాంపట్నం ప్రాంతానికి చెందిన రమ్యకృష్ణ (35)ను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. వీరిరువురిదీ రెండో వివాహమే. గతంలో చేబ్రోలు ప్రభుత్వ కళాశాలలో పని చేసిన కోటేశ్వరరావు కొంత కాలం క్రితం గుంటూరు ఉమెన్స్‌ కళాశాలకు రికార్డు అసిస్టెంట్‌గా బదిలీ అయ్యాడు. బుధవారం రాత్రి భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు.

మద్యం మత్తులో ఉన్న భర్త రోకలిబండతో భార్య తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అనంతరం స్థానిక రోడ్డుపై తిరుగుతున్నాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో నైట్‌ బీట్‌ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావును నిలదీశారు. దీంతో భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. వెంటనే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్‌ఐ వీ బాబురావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement