
సాక్షి, రేగొండ: కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లిలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన మోటం లత అనే మహిళను ఆమె భర్త సదయ్య గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున లతను హత్య చేసి సదయ్య పరారయ్యాడని మృతురాలి బంధువులు,గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment