Jayasankar Bhupalpally
-
Telangana: 19 ప్రాణాలు.. 10 లక్షల ఎకరాలు.. వరదలతో అతలాకుతలం
భారీ వర్షాలు, వరదలు పలుచోట్ల తీవ్ర విషాదాన్ని నింపాయి. గత మూడు రోజుల్లో వాగులు, వరద నీటిలో పదుల సంఖ్యలో జనం గల్లంతుకాగా.. వారిలో కొందరి మృతదేహాలు గురు, శుక్రవారాల్లో బయటపడ్డాయి. దీనితో వారి కుటుంబాలన్నీ తీవ్ర విషాదంలో చిక్కుకున్నాయి. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి వరకు 19 మంది మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉందని స్థానికులు చెప్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో జంపన్నవాగు వరదలో గల్లంతైన 15మందిలో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది. భూపాలపల్లి జిల్లాలో హెలికాప్టర్ ద్వారా ఆహారం జార విడుస్తున్న ఐఏఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో గురువారం రాత్రి వరదలో గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్ష్మి, గంగిడి సరోజన గల్లంతయ్యారు. వారి కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు కూడా వారి ఆచూకీ దొరకలేదు.సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రుప్ప గ్రామ పెద్ద చెరువులో కృష్ణ అనే యువకుడు, మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్‌లో పడమంచి నర్సింహులు, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాములు చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌కు చెందిన పెండ్ర సతీశ్ (23) గురువారం రాత్రి మున్నేటి వరదలో గల్లంతుకాగా. శుక్రవారం మృతదేహం లభ్యమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంకు చెందిన ఎస్కే గాలీబ్ పాషా (33) ఈ నెల 26న భార్యతో గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం తిప్పనపల్లి వద్ద వాగులో ఆయన మృతదేహం లభించింది. భద్రాచలం వద్ద మహోగ్రంగా గోదావరి.. 53 అడుగులకు నీటిమట్టం బుధవారం భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కుమ్మరిపాడులోని పాములేరు వాగులో కొట్టుకుపోయిన కుంజా సీత (60) మృతదేహం శుక్రవారం మామిళ్లగూడెం శివారులోని వాగులో బయటపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వివిధ చోట్ల వాగుల్లో గల్లంతైన నలుగురు మరణించారు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి మొరంవాగులో రేకల కౌశిక్ (9), మోహన్ (40) కొట్టుకుపోయారు. ఆదిలాబాద్ జిల్లా సిరి కొండ మండలం వైపేట్కు చెందిన సంగం గంగాధర్ (45) స్థానిక వాగులో గల్లంతయ్యాడు. భూపాలపల్లి అర్బన్: మొత్తం 285 ఇళ్లు.. అందులో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి.. చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి.. బైక్‌లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు.. తినటానికి తిండి లేదు.. తాగేందుకు నీరు లేదు.. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి.. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మోరంచపల్లి గ్రామం బోరుమంటోంది. మరోవైపు గల్లంతైన నలుగురి ఆచూకీ దొరకక.. వారి కుటుంబాలు ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాయి. గల్లంతైన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్షి్మ, గంగిడి సరోజనల ఆచూకీ కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. మంథనిలో పొలాలను ముంచిన గోదావరి ఏ ఆధారమూ లేని పరిస్థితిలో.. గురువారం తనను చుట్టేసిన మోరంచవాగు వరద ఉధృతికి మోరంచపల్లి గ్రామం సర్వం కోల్పోయింది. ఇళ్లలో సుమారు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు చేరింది. ప్రతి ఇంట్లో బియ్యం, పప్పుల వంటి నిత్యావసరాల నుంచి టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎల్రక్టానిక్ పరికరాల దాకా వస్తువులన్నీ నీట మునిగిపోయాయి. కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గ్రామంలో మొత్తం 285 ఇళ్లు ఉండగా 4 ఇళ్లు పూర్తిగా, 281 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒండ్రు మట్టి, ఇసుక మేట, చెత్తాచెదారంతో నిండిపోయాయి. శుక్రవారం వరద తగ్గాక గ్రామస్తులు ఇళ్లలో ఒండ్రుమట్టిని ఎత్తిపోస్తూ, తడిసిన వస్తువులను ఆరబెట్టుకుంటూ కనిపించారు. వరద తాకిడికి కొన్ని ఇళ్ల పునాదులు కూడా కదలడం, ఇంటి గోడలు, ప్రహరీలు కూలిపోవడం ఆందోళనకరంగా మారింది. అన్నీ కొట్టుకుపోయి.. మోరంచపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ నిమిత్తం గేదెలు, కోళ్లు పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయి పొలాలు, చెట్లపోదల్లో చిక్కుకున్నాయి. కొన్నింటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. మొత్తం 159 పశువులు, గేదెలు, 3 ఎద్దులు, 855 కోళ్లు, 3 బాతులు చనిపోయాయి. గ్రామ పరిసరాల్లో అక్కడక్కడా చనిపోయి ఉన్న గేదెలను అధికారులు శుక్రవారం జేసీబీల సహాయంతో గ్రామానికి దూరంగా తరలించి ఖననం చేశారు. వరద ముంపులో వరంగల్ గ్రామస్తులకు భరోసా.. తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అధికారులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి రూ.10 లక్షలను గ్రామ ప్రజలకు ఆర్థిక సాయంగా అందించారు. గల్లంతై.. కరెంటు తీగలపై వేలాడి.. మేడారం జంపన్నవాగులో గల్లంతైన యాచకుడి మృతదేహం శుక్రవారం వరద తగ్గిన తర్వాత ఇలా కరెంట్ తీగలకు చిక్కుకొని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని కరెంట్ తీగలపై నుంచి తొలగించి పంచనామా నిర్వహించారు. -
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లారీ దగ్ధం
-
విద్యుత్ బిల్లు కట్టేందుకు వెళ్లి మైనర్‌పై అఘాయిత్యం
సాక్షి, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మైనర్ బాలికపై కరెంట్ బిల్లు కొడుతానని వెళ్లిన కాంట్రాక్టు ఉద్యోగి కింద పనిచేసే మరో యువకుడు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారయత్నం చేయబోయాడు. ఇది గమనించిన బాలిక సోదరుడు అతనిపై తిరగబడడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బాధిత బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విద్యుత్ బిల్లులు కొట్టేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్ చేసి సదరు వ్యక్తి తమ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని అతన్ని పిలిపిస్తే మాట్లాడుతామని చెప్పడంతో శనివారం ఉదయం సదరు కాంట్రాక్టు ఉద్యోగి నిందితుడు గుర్రం కిషోర్‌ను (26) తీసుకుని అప్పయ్యపల్లి గ్రామానికి వెళ్లాడు. చదవండి: (బస్సు, ఆటో ఢీ : అత్త, అల్లుడి దుర్మరణం) నిందితుడిని చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులై దాడి చేశారు. దీంతో నిందితుడు ప్రాణభయంతో స్థానిక ఉపసర్పంచ్ సదయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో మండిపడిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి డాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీస్‌లు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
వివాహేతర సంబంధం: యువకుడు దారుణ హత్య
సాక్షి,మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నిమ్మగూడెంలో శుక్రవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. అదే గ్రామానికి చెందిన జాడి ప్రవీణ్(32) స్థానికంగా కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఊళ్లోకి వెళ్లిన అతడు 10 దాటిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడు. ఎంతకూ రాకపోగా తెల్లవారేసరికి శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ బోనాల కిషన్‌తోపాటు ఇతర అధికారులు శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పదునైన ఆయుదంతో తల వెనక, ముందు భాగంలో పొచిడి హత్య చేసిన ఆనవాళ్లను గుర్తించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు.కాగా, సదరు యువకుడికి గ్రామానికి చెందిన ఓ వివాహితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో వివాహిత సంబంధికులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తమ్ముడు సుదర్శన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. అదుపులో నిందితులు? ప్రవీణ్‌ను హత్య చేశారని అనుమానిస్తున్న కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతో ఈ హత్య చేశారని భావిస్తున్న పోలీసులు.. మరికొంత మంది యువకులను అవసరమైతే పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించినట్లు తెలిసింది. -
పోచంపల్లిలో దారుణ హత్య
సాక్షి, రేగొండ: కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లిలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన మోటం లత అనే మహిళను ఆమె భర్త సదయ్య గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున లతను హత్య చేసి సదయ్య పరారయ్యాడని మృతురాలి బంధువులు,గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువతకు గాలం
సాక్షి, భూపాలపల్లి: ఈ సారి ఎన్నికల్లో యువకులు కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లాలో కొత్త యువ ఓటర్ల సంఖ్య పెరిగింది. దీంతో వారిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో యువ ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండు సెగ్మెంట్లలో కలిపి లక్షకు పైగా యువ ఓటర్లు ఉన్నారు. వీరు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకంగా మారనుండడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి వారిపై పడింది. వారు ఎటువైపు మొగ్గుచూపుతారోనని యువకుల నాడి పట్టుకునేందుకు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. యువతను ఆకట్టుకునేందుకు ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు తదితర హామీలను ప్రత్యేకంగా గుప్పిస్తున్నారు. 1,13,322 మంది యువ ఓటర్లు.. రెండు నియోజకవర్గాల్లో కలిపి 1,13,322 మంది యువ ఓటర్లు ఉన్నారు. వీరిలో 18–19 సంవత్సరాల వయసు ఉన్నవారు 9,923 మంది ఉంటే వీరిలో యువకులు 5,919, యువతులు 4,004 మంది ఉన్నారు. 20–29 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లు 1,03,399 మంది ఉండగా వీరిలో పురుషులు 57,104, స్త్రీలు 46,295 మంది ఉన్నారు. ములుగు నియోజకవర్గంతో పోలిస్తే భూపాలపల్లిలో ఎక్కువగా యువ ఓట్లు ఉన్నాయి. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న వారిని తీసుకుంటే ములుగులో 52,360 ఓటర్లు ఉండగా భూపాలపల్లి పరిధిలో 60,962 మంది ఉన్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు యువ ఓటర్లపై ఫోకస్ పెంచాయి. దాదాపు అందరూ విద్యావంతులే కావడంతో వారి ఓట్లు ఎలా పొందాలనే ఆలోచనలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాడానికి నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. ఆకర్షించే పనిలో పార్టీలు జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాక ఇప్పుడిప్పుడే పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. చేరికల్లో ముఖ్యంగా యువత ఎక్కువ సంఖ్యలో ఉండడంతో నాయకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని చెబుతున్నాయి. అధికారంలోకి రాగానే మెగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని అంటున్నాయి. మరో వైపు యువత ఎప్పుడూ కేసీఆర్ పక్షమే అని టీఆర్ఎస్ నాయకులు చెబుతుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంపై యువత తీవ్ర వ్యతిరేకంగా ఉందని, వారు తమ పార్టీనే ఆదరిస్తారనే ధీమాలో ఉన్నారు. -
బొగత జలపాతంలో ఒకరి గల్లంతు
వాజేడు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతంలో ఆదివారం బుర్రి ప్రసాద్ (28) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతయ్యాడు. సహాయక సిబ్బంది అతడి కోసం గాలించినప్పటికీ సాయంత్రం వరకూ ఆచూకీ లభించలేదు. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం రామవాడకు చెందిన ప్రసాద్ కూకట్‌పల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బొగత జలపాతాన్ని సందర్శించడానికి స్నేహితులు మినుగు అనిల్, వేముల వినయ్, రావుల నిఖిల్ తో కలసి ఇక్కడికి వచ్చారు. ప్రసాద్ జలపాతం కింది భాగం లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంత య్యాడు. సహాయక సిబ్బందితోపాటు గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. సోమవారం కూడా గాలింపు చేపడతామని ఎస్సై చెప్పారు. కాగా, జలపాతంలో గల్లంతైన ప్రసాద్ కోసం గాలిస్తున్న సమయంలోనే హన్మ కొండకు చెందిన ఎస్వీ రెడ్డి అనే వ్యక్తి బొగతలో వస్తున్న వరదలో పడిపోయాడు. అతను నీటిలో మునిగిపోతుండగా సహాయక సిబ్బంది అతడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. -
పొట్టకూటికి వెళ్తూ..
ఏటూరునాగారం : పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం మండపాక వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన 50 మంది కూలీలు కమలాపురం గ్రామానికి చెందిన కొమిరె బాబురావు డ్రైవర్, యజమాని అయిన బొలెరో వాహనంలో మండపాక మిరప కోతల కోసం ఓ రైతు పొలంలోకి వెళ్తున్నారు. ముల్లకట్ట బ్రిడ్జి దాటిన తర్వాత కూతవేటు దూరంలో వాహనం ముందు టైర్ పేలింది. వాహనంలో అధికలోడు ఉండడంతో వాహనం అదుపుకాలేదు. దీంతో ఒకవైపు బోల్తా పడింది. అందులో ఉన్న కూలీలు ఒకరిపై ఒకరు పడి రోడ్డుపై పడ్డారు. దీంతో కాళ్లు, చేతులు, నడుముతోపాటు శరీరం నిండా గాయాలయ్యాయి. 50 మంది కూలీల్లో 5 గురికి ఎలాంటి గాయాలు కాలేదు. మిగతా 19 మందిని వరంగల్ ఎంజీఎం, ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 20 మంది ఏటూరునాగారం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఏజెన్సీ మండలాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి, రాజకీయ నాయకులు, పోలీసులు, గ్రామస్తులంతా పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు. మూడు 108 వాహనాలు ఉండడంతో మిగతావారిని ప్రైవేటు వాహనాల్లో వరంగల్‌కు తరలించారు. ఎంజీఎం, ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు మండపాక వద్ద బోల్తా పడిన బోలెరో వాహనంలో గాయపడిన 20 మందిని వరంగల్ ఎంజీఎంతో పాటు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు కోరం అంజలి, కోరం జానకి, కోరం సత్తమ్మ, నక్కల లక్ష్మి, ముద్దబోయిన నర్సమ్మ, సాదం లక్ష్మి, కోరం సారమ్మ, దబ్బగట్ల లక్ష్మికాంత, నక్కల ఉప్పలయ్య, పూనెం యాకలక్ష్మి, గొగ్గళి స్వరూప, ఉడత ఎల్లమ్మ, జక్కుల కోమలత, ముద్దబోయిన సారమ్మ, పూనెం శిరీష, మెట్టు రజిత, చాట్ల పుష్పలత, కొత్తపల్లి లలిత, గోపు కవిత, బాసబోయిన మల్లమ్మ, దొండ సాలమ్మ, కోమటిరెడ్డి మణెమ్మలను ఆస్పత్రులకు 108లో తరలించారు. చికిత్స పొందుతున్న వారు.. ధనసరి భవాని, ముద్దబోయిన సరస్వతి, ముద్దబోయిన నర్సమ్మ, దాసరి స్వరూప, దాసరి సంతోషా, దాసరి కవిత, కోరం హనుమంతు, పూనెం రమా, ముద్దబోయిన రమా, కోరం సమ్మక్క, నక్కల సత్యమ్మ, పూనెం సీత, ధనసరి సంధ్యారాణి, సిద్దబోయిన సాంబలక్ష్మి, పొన్నాల భాగ్యలక్ష్మి, కోరం సుధా, కోరం లక్ష్మి, దబ్బగట్ల సొంబాయి, చెరుకు హరిత, బండి విజయ, దొండ మల్లయ్యలు చికిత్స పొందుతున్నారు. కాగా పూనెం జయ, పూనెం రాములమ్మ, గొగ్గళి రేష్మ, ధనసరి సమ్మక్క, దబ్బగట్ల సౌజన్యకు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు. మృతి చెందిన ఐలయ్య, చంద్రమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు -
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి
భూపాలపల్లి అర్బన్ : నీతి ఆయోగ్‌తో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌మిశ్రా అన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా దుర్గాశంకర్‌మిశ్రా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు, మిషన్ భగీర«థ పనులు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం, డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మా ణం, కేసీఆర్ కిట్ల పథకం అమలు తీరు బాగుందని తెలిపారు. అలాగే టూరిజం అభివృద్ధి పనులు చకచక సాగుతున్నాయని, జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా జంతు సంపద అధికంగా లేదన్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఇతర జంతువులు పెంపకాన్ని అధికారులు ప్రోత్సహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో మాట్లాడి కర్ణాటక రాష్ట్రం తరహాలో ఎకో టూరి జానికి ప్రత్యేక అధికారులను నియమించేలా చూస్తామని తెలిపారు. మరో 8 నెలల్లో జిల్లా సందర్శనకు వస్తానని, అప్పటి లోపు అభివృద్ధి చేసి చూపించాలన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ రవికిరణ్, డీఆర్వో మోహ న్లాల్, జిల్లా అధికారులు అనురాధ, డాక్టర్ అప్పయ్య, అక్బర్, రాజారావు, భూపాలపల్లి మునిసిపల్ కమిషనర్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు. -
బొమ్మలొద్దిగుట్టపై ప్రాచీన చిత్రాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి(ములుగు): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం నర్సాపూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బొమ్మలొద్దిగుట్టపై ఆదిమానవులు వేసిన చిత్రాలు బుధవారం వెలుగు చూశాయి. జిల్లా ఎకో టూరిజం కోఆర్డినేటర్ సుమన్ స్థానికుల సాయంతో గుట్టలను సందర్శించి వీటిని గుర్తించారు. బొమ్మలొద్దిగా వ్యవహరించే ఈ కొండల్లో ఆదిమానవులు ఎరువు, తెలుపు రంగుల్లో చిత్రించిన రెండు చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి ఇదే మండలంలోని రాక్షసులగుట్టల్లో ఉన్న మెగాలితిక్ సమాధులకు చాలా దగ్గరగా ఉన్నట్లు సుమన్ వెల్లడించారు. జయశంకర్ జిల్లాలో రాక్ పెయింటింగ్ ఉన్న మూడో ప్రాంతంగా బొమ్మలొద్ది గుట్టను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ గుట్టపై నీటి కొలనులు కూడా ఉన్నాయి. పురావస్తు శాఖ అధికారులు వీటిపై మరింత పరిశోధన చేసి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. -
విధి నిర్వహణలో గుండెపోటు: ఎస్సై మృతి
భూపాలపల్లి: విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు రావడంతో ఓ ఎస్సై మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్పీ నివాసం ఎదురుగా డీఎస్పీ కార్యాలయం ఉంది. అందులో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ సుధాకర్ (55)కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. ఆయన కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. -
మన్యంలో బాంబుల కలకలం
వెంకటాపురం(కె): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(కె) మండల పరిధిలోని విజయపురి కాలనీ సమీపంలో మావోయిస్టులు మంగళవారం పోస్టర్లు మాటున అమర్చిన ప్రెషర్బాంబు కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్లే కొత్తపల్లి రహదారి సమీపంలో అమర్చిన ఈ బాంబును వెంకటా పురం సీఐ నలవాల రవీందర్, ఎస్సై బండారి కుమార్ ఆధ్వర్యంలో బాంబుస్క్వాడ్, డాగ్ డ్, సీఆర్ఫీఎఫ్ బలగాలు వెళ్లి రెండు గంటలపాటు శ్రమించి ఆ ప్రెషర్‌బాంబును నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా వెంకటాపురం మండలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చి వెళ్లే వాహనాలను రెండుగంటలపాటు నిలిపివేసి ట్రాఫిక్ నియంత్రించారు. దీంతో ఇరువైపులా వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యారు. కాగా రెండు గంటల పోలీస్ అపరేషన్ తర్వాత బాంబును నిర్వీర్యం చేయటంతో ఊపిరి పీల్చుకున్నారు. భయం భయంగా.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజ లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు డిసెంబర్ 2 నుంచి 8 వ తేదీ వరకు మావోయిస్టులు పీఎల్జీఎ వారోత్సవాలకు పిలుపునివ్వడంతో పోలీసులు తెలం గాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోలీసు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలు భయం గుప్పిట నుంచి భయటపడడం లేదు. వరుస బాంబులతో.. వెంకటాపురం మండలంలో మావోలు తమ ఉనికిని చాటుకునేందుకు వరుస బాంబులను అమర్చి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. 2016 జూన్1న సూరవీడు సమీపంలోని విజయపురి కాలనీలో కొత్తపల్లికి వెళ్లే రహదారి సమీపంలో ప్రెషర్ బాంబు అమర్చడంతో ఛత్తీస్‌ఘఢ్‌కు చెందిన తెల్లం రమేష్ అనే యువకుడికి గాయాలయ్యాయి. 2016 జాలై 24న మొర్రవానిగూడెం గ్రామ సమీపంలో బకెట్ బాంబులను అమర్చి భయందోళనలకు గురిచేశారు. 2016 డిసెంబర్ 1న సూరవీడు వద్ద ప్రెషర్ బాంబు పేలి కార్తీక్ అనే ఆటో డ్త్రెవర్కు గాయాలయ్యాయి. 2017 మార్చి 4న పాలెం ప్రాజెక్టు వద్ద మందు పాతరను అమర్చారు. నవంబర్ 5 న ఆలుబాక సమీపంలో 2 మందు పాతరలను అమర్చి కలకలం సృష్టించారు. -
ఐదు రోజులుగా ప్రియుడి ఇంటి ముందే..
జయశంకర్ భూపాలపల్లి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్న యువకుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్బీనగర్కు చెందిన బోడ కళాసాగర్ ఇంటి ముందు అతను ప్రేమించిన నాగమణి ఐదురోజులుగా దీక్ష చేస్తోంది. కళాసాగర్తో పెళ్లి జరిపించేంత వరకు ఇక్కడి నుంచి కదలనని భీష్మించుకొని కూర్చుంది. యువతికి మహిళా సంఘాల వారు మద్దతు తెలిపారు. కాగా.. ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.