వెంకటాపురం(కె): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(కె) మండల పరిధిలోని విజయపురి కాలనీ సమీపంలో మావోయిస్టులు మంగళవారం పోస్టర్లు మాటున అమర్చిన ప్రెషర్‌బాంబు కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్లే కొత్తపల్లి రహదారి సమీపంలో అమర్చిన ఈ బాంబును వెంకటా పురం సీఐ నలవాల రవీందర్, ఎస్సై బండారి కుమార్ ఆధ్వర్యంలో బాంబుస్క్వాడ్, డాగ్ డ్, సీఆర్‌ఫీఎఫ్ బలగాలు వెళ్లి రెండు గంటలపాటు శ్రమించి ఆ ప్రెషర్‌బాంబును నిర్వీర్యం చేశారు.
ఈ సందర్భంగా వెంకటాపురం మండలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చి వెళ్లే వాహనాలను రెండుగంటలపాటు నిలిపివేసి ట్రాఫిక్ నియంత్రించారు. దీంతో ఇరువైపులా వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యారు. కాగా రెండు గంటల పోలీస్ అపరేషన్ తర్వాత బాంబును నిర్వీర్యం చేయటంతో ఊపిరి పీల్చుకున్నారు.
భయం భయంగా..
ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజ లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు డిసెంబర్ 2 నుంచి 8 వ తేదీ వరకు మావోయిస్టులు పీఎల్‌జీఎ వారోత్సవాలకు పిలుపునివ్వడంతో పోలీసులు తెలం గాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోలీసు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలు భయం గుప్పిట నుంచి భయటపడడం లేదు.
వరుస బాంబులతో..
వెంకటాపురం మండలంలో మావోలు తమ ఉనికిని చాటుకునేందుకు వరుస బాంబులను అమర్చి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. 2016 జూన్1న సూరవీడు సమీపంలోని విజయపురి కాలనీలో కొత్తపల్లికి వెళ్లే రహదారి సమీపంలో ప్రెషర్ బాంబు అమర్చడంతో ఛత్తీస్‌ఘఢ్‌కు చెందిన తెల్లం రమేష్ అనే యువకుడికి గాయాలయ్యాయి.
2016 జాలై 24న మొర్రవానిగూడెం గ్రామ సమీపంలో బకెట్ బాంబులను అమర్చి భయందోళనలకు గురిచేశారు. 2016 డిసెంబర్ 1న సూరవీడు వద్ద ప్రెషర్ బాంబు పేలి కార్తీక్ అనే ఆటో డ్త్రెవర్‌కు గాయాలయ్యాయి. 2017 మార్చి 4న పాలెం ప్రాజెక్టు వద్ద మందు పాతరను అమర్చారు. నవంబర్ 5 న ఆలుబాక సమీపంలో 2 మందు పాతరలను అమర్చి కలకలం సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment