భూపాలపల్లి: విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు రావడంతో ఓ ఎస్సై మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్పీ నివాసం ఎదురుగా డీఎస్పీ కార్యాలయం ఉంది. అందులో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ సుధాకర్ (55)కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. ఆయన కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది.