విద్యుత్‌ బిల్లు కట్టేందుకు వెళ్లి మైనర్‌పై అఘాయిత్యం | Minor Girl Molested by Young Man in Jayasankar Bupalapalli | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లు కట్టేందుకు వెళ్లి మైనర్‌పై అఘాయిత్యం

Published Sun, Jan 23 2022 9:36 AM | Last Updated on Sun, Jan 23 2022 2:12 PM

Minor Girl Molested by Young Man in Jayasankar Bupalapalli - Sakshi

సాక్షి, గణపురం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మైనర్‌ బాలికపై కరెంట్‌ బిల్లు కొడుతానని వెళ్లిన కాంట్రాక్టు ఉద్యోగి కింద పనిచేసే మరో యువకుడు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో  అత్యాచారయత్నం చేయబోయాడు.

ఇది గమనించిన బాలిక సోదరుడు అతనిపై తిరగబడడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బాధిత బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విద్యుత్‌ బిల్లులు కొట్టేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్‌ చేసి సదరు వ్యక్తి తమ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని అతన్ని పిలిపిస్తే మాట్లాడుతామని చెప్పడంతో శనివారం ఉదయం సదరు కాంట్రాక్టు ఉద్యోగి నిందితుడు గుర్రం కిషోర్‌ను (26) తీసుకుని అప్పయ్యపల్లి గ్రామానికి వెళ్లాడు.

చదవండి: (బస్సు, ఆటో ఢీ : అత్త, అల్లుడి దుర్మరణం)

నిందితుడిని చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులై దాడి చేశారు. దీంతో నిందితుడు ప్రాణభయంతో స్థానిక ఉపసర్పంచ్‌ సదయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో మండిపడిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి డాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీస్‌లు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement