
కర్నూలు,గోస్పాడు: కట్టుకున్న భార్యను ఓ భర్త కడతేర్చిన ఘటన మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గోస్పాడుకు చెందిన చాకలి శ్రీనివాసులకు శిరివెళ్ల మండలం కామినేనిపల్లెకు చెందిన లక్ష్మిదేవి(35)కి పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమాుర్తెలు. శ్రీనివాసులు కొంత కాలంగా తాగుడుకు బానిసయ్యాడు. ఎలాంటి పనులకు వెళ్లకపోవంతో పాటు తాగేందుకు డబ్బులివ్వాలని భార్యను వేధించేవాడు.
ఇదే విషయమై సోమవారం రాత్రి భార్యభర్త మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడై రోకలి బండతో భార్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. శిరివెళ్ల సీఐ శివశంకర్, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment