
భర్త, పిల్లలతో శ్రీదేవి(ఫైల్)
రాజాం సిటీ : స్థానిక మల్లికార్జునకాలనీకి చెందిన సాదు సూరిబాబు, సంపత్‌కుమారిల చిన్నకుమార్తె కడపలోని విజయదుర్గ కాలనీలో హత్యకు గురైంది. మృతురాలి కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలావున్నాయి.
ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన బాస వీరభద్రరావుకు సాదు సూరిబాబు, సంపత్‌కుమారిల కుమార్తె శ్రీదేవిని ఇచ్చి 14 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీదేవి భర్త ఉద్యోగరీత్యా కడపలో సివిల్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
కొన్నాళ్లుపాటు వీరి జీవితం సాఫీగా సాగింది. కొన్నేళ్లుగా అదనపు కట్నం తీసుకురమ్మంటూ శ్రీదేవిని భర్త తరచూ వేధిస్తున్నాడు. ఏదో ఒక రకంగా నచ్చజెప్పి డబ్బులు ఇస్తామని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ వేధింపులు ఆపలేదు.
దీంతో భార్యపై కోపం పెంచుకొని ఆదివారం రాత్రి తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో చేసేదేమీలేక వీరభద్రరావు ఆమెకు ఉరివేసి చంపేశాడని శ్రీదేవి తండ్రి సూరిబాబు, తల్లి సంపత్‌కుమారి బోరున విలపిస్తున్నారు.
కుమార్తె మతిచెందిన విషయం సోమవారం ఉదయాన్నే సమాచారం అందడంతో హుటాహుటీన అక్కడకు వెళ్లి జరిగిన సంఘటనకు సంబంధించి అక్కడి పోలీసులకు ఫిర్యాదుచేశామని తెలిపారు. తమ కుమార్తె మతికి కారకుడైన వీరభద్రరావును కఠినంగా శిక్షించి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.
మల్లికార్జున కాలనీలో విషాదం
కడపలో శ్రీదేవి హత్యకు గురై మతిచెందిన విషయం స్థానిక మల్లికార్జున కాలనీవాసులకు తెలియడంతో వీరంతా విషాదంలో మునిగిపోయారు. అందరితో కలిసిమెలిసి ఉంటూ ఎంతో సరదాగా ఉండే ఆమె హత్యకు గురికావడం జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి మతదేహాన్ని రాజాంకు తీసుకువస్తున్నారని తెలియడంతో కాలనీవాసులంతా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment