
సాక్షి, హన్మకొండ: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు హరీష్‌తో రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల కిత్రమే భార్యతో గొడవపడిన హరీష్ క్రిమిసంహారక మందు తాగాడు. హస్పిటల్‌లో చికిత్స తీసుకొని ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు.
అయితే మరోసారి భార్యభర్తల మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రోక్తుడైన భర్త హరీష్ సోమవారం అర్థరాత్రి భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: అనుమానమే పెనుభూతమై.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment