అనంతపురం, బొమ్మనహాళ్: భార్యను హత్య చేసి ఆపై భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం తారకాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు కథనం మేరకు .. కణేకల్లు మండలం బిదురుకొంతం గ్రామానికి చెందిన హరిజన సురేష్ (25) బొమ్మనహాళ్ మండలం తారకాపురంలోని తిప్పయ్య కుమారై హరిజన లలిత (21) తొమ్మిది నెలల క్రితం వివాహాం చేసుకున్నాడు. కొన్ని నెలలు వీరి దాంపత్యం సాఫీగా సాగింది. ఇటీవల లలితకు ఆరోగ్యం సరిగ్గా లేదు. దీనికితోడు సంతానం కలుగలేదు. ఈ నేపథ్యంలో కల్లుదేవనహళ్లి వన్నూరుస్వామి పీర్ల చావిడిలో మొక్కులు తీర్చుకుంటే రోగం నయమై సంతానం కలుగుతుందని తెలిసిన వాళ్లు చెప్పడంతో భర్తతో కలిసి లలిత పుట్టిళ్లు అయిన తారకాపురం గ్రామానికి వచ్చింది.
తారకాపురంలో భర్త చేతిలో హతమైన లలిత, చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త సురేష్
అక్కడి నుంచి కల్లుదేవనహళ్లి దగ్గర కావడంతో అక్కడికి వెళ్దామని భావించారు. అయితే ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న సురేష్ గురువారం లలిత తల్లిదండ్రులు ఎవరూ లేని సమయంలో భార్యతో గోడవపడ్డాడు. ఇందులో భాగంగానే తలపై బండను మోదడంతో లలిత చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అనంతరం భర్త కూడా ఇంటి సమీపంలోని ఓ చెట్టుకు ఊరి వేసుకునేందుకు ప్రయత్నం చేశాడని, అయితే అక్కడ జన సంచారం ఉండటంతో గ్రామ సమీపంలోని వేప చెట్టుకడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, రాయదుర్గం రూరల్ సీఐ రాజా, బొమ్మనహాళ్ ఎస్‌ఐ రమాణారెడ్డి పరిశీలించారు. లలిత తండ్రి తిప్పయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భార్యను హత్య చేసి.. ఆపై భర్త ఆత్మహత్య
Published Fri, Feb 21 2020 12:23 PM | Last Updated on Fri, Feb 21 2020 12:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment