అనుమానమే పెనుభూతం | Husband Killed Wife in Tamil Nadu | Sakshi
Sakshi News home page

అనుమానమే పెనుభూతం

Jan 22 2019 11:52 AM | Updated on Jan 22 2019 11:52 AM

Husband Killed Wife in Tamil Nadu - Sakshi

తులసిమణి (ఫైల్‌)

చెన్నై , అన్నానగర్‌: తారా పురం సమీపంలో ఆదివారం రాత్రి భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుప్పూర్‌ జిల్లా తారాపురం సమీపం గుండడం మరవపాలైయానికి చెందిన సెంథిల్‌కుమార్‌ (40) కూలీ. ఇతని భార్య తులసిమణి (35). వీరికి పూంగొడి (19) అనే కుమార్తె, గోకుల్‌ (14) అనే కుమారుడు ఉన్నారు.

సెంథిల్‌కుమార్, తులసిమణి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ స్థితిలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య తగాదా ఏర్పడింది. దీంతో ఆగ్రహంచిన సెంథిల్‌కుమార్‌ కత్తితో తులసిమణి గొంతు కోసి హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి వచ్చిన గుండడం పోలీసులు తులసీమణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అజ్ఞాతంలో ఉన్న సెంథిల్‌కుమార్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement