భార్య, ప్రియుడిని హత్యచేసిన భర్త | Husband Killed Wife And Her Boyfriend In Tamil Nadu | Sakshi
Sakshi News home page

భార్య, ప్రియుడిని హత్యచేసిన భర్త

Aug 24 2018 10:17 AM | Updated on Aug 24 2018 10:17 AM

Husband Killed Wife And Her Boyfriend In Tamil Nadu - Sakshi

మృతిచెందిన తంగమణి, పెరుమాళ్, (ఇన్‌సెట్‌) హరికృష్ణన్, తంగమణి దంపతులు

అర్ధరాత్రి ఉల్లాసంగా ఉన్న భార్య, ప్రేమికుడిని హత్య చేసిన భర్త పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు

అన్నానగర్‌: అర్ధరాత్రి ఉల్లాసంగా ఉన్న భార్య, ప్రేమికుడిని హత్య చేసిన భర్త పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటన కోవిల్‌పట్టి సమీపంలోని బుధవారం జరిగింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లా కయత్తారు సమీపంలోని మమ్మలైపట్టి గ్రామానికి చెందిన పెరుమాళ్‌ (50) రైతు. ఇతని భార్య కనకలక్ష్మి. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. కోవిల్‌పట్టి సమీపంలోని తంగమణి (38)కి పెరుమాల్‌కి వివాహేతర సంబంధం ఏర్పడింది. తంగమణి భర్త హరికృష్ణన్‌ (40) కేరళ రైల్వేలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.

మందలించనా మారలేదు..
పెరుమాల్, తంగమణి వివాహేతర సంబంధం స్థానికులకు తెలిసింది. దీంతో ఇద్దరిని బంధువులు మందలించారు. అయినా తంగమణి, పెరుమాల్‌ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఈ స్థితిలో కేరళలో వరదలు రావడంతో అక్కడ నుంచి హరికృష్ణన్‌ సొంత ఊరుకి వచ్చాడు. గురువారం రాత్రి హరికృష్ణన్‌కు నిద్రమాత్రలు ఇచ్చింది. భార్య హఠాత్తుగా నిద్రమాత్రలు ఇవ్వడంతో అనుమానం ఏర్పడింది. ఏమి తెలియనట్లుగా హరికృష్ణన్‌ మాత్రలు వేసుకున్నట్లే నటించి విసిరేశాడు. తరువాత ఇంట్లో నిద్రపోతున్నట్లు నటించాడు. అర్ధరాత్రి పెరుమాల్‌ తంగమణికి ఫోన్‌ చేసి ఊరు బయట ఉన్న గడ్డివాముకి రమ్మని పిలిచాడు. తంగమణి పెరుమాళ్‌ కోసం వెళ్లింది. ఇది చూసిన హరికృష్ణన్‌ ఆగ్రహంతో భార్య, ప్రేమికుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని భార్యకు తెలియకుండా వేరే దారిలో ఆమెను వెంబడిస్తూ వెళ్లాడు. అక్కడ గడ్డివాములో పెరుమాల్, తంగమణి ఉల్లాసంగా ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆగ్రహంతో హరికృష్ణన్‌ కత్తితో పెరుమాళ్‌ను, తంగమణిని నరికాడు. తీవ్రగాయాలతో ఇద్దరూ సంఘటన స్థలంలోనే మృతిచెందారు. అనంతరం హరికృష్ణన్‌ కత్తితో కడంబూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మణియాచ్చి డీఎస్పీ జ్ఞాన సంబంధం, కడంబూర్‌ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. పెరుమాళ్, తంగమణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement