ఆ మ్యాచ్ చీర్ లీడర్లకు పీడకల.. | When A Game Of Baseball In Japan Turned Into A Nightmare | Sakshi
Sakshi News home page

ఆ మ్యాచ్ చీర్ లీడర్లకు పీడకల..

Published Wed, Jun 8 2016 8:58 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

ఆ మ్యాచ్ చీర్ లీడర్లకు పీడకల..

ఆ మ్యాచ్ చీర్ లీడర్లకు పీడకల..

ఆటలోని మజా రెట్టింపయ్యేలా అద్భుత నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేసే చీర్ లీడర్లు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. తమవైపు దూసుకువస్తోన్న వికృత రూపాలను చూసి వణికిపోయారు. ఆ మ్యాచ్ వారికి పీడకల. అవునుమరి, పచ్చినెత్తురు తాగే పిశాచాలు గ్రౌండ్ లోకి చొరబడితే ఎవరికైనా గుండె ఝల్లుమనదా!

జపాన్ లో జరిగిన ఓ బేస్ బాల్ మ్యాచ్ లో సడాకో, కయాకో అనే దెయ్యాలు కాసేపు అందరినీ భయభ్రాతులకు గురిచేశాయి. మన దగ్గర కామినీ పిశాచి, శాకిని, ఢాకినీ, మోహినీ, కొరివి.. లాంటి దయ్యాలున్నట్లే జపాన్ లో సడాకో, కయాకో దయ్యాలు ఫేమస్. పచ్చి మనిషి నెత్తురు మాత్రమే సేవించే ఆ దయ్యాలు కాసేపు బ్యాట్, బాల్ పట్టుకుని హల్ చల్ చేశాయి. నిప్పొన్ హ్యామ్ ఫైటర్స్, యాకుల్ట్ స్వాలో జట్ల మధ్య జరగాల్సిన అసలు మ్యాచ్ కు ముందు ఈ దయ్యాల క్యారెక్టర్లు ఆడిన ఈ ఆట తాలూకు వీడియోకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement