dead fish
-
Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు
టోక్యో: ఉత్తర జపాన్ బీచ్‌లో వేలాది చేపలు మృతి చెందాయి. జపాన్ ఉత్తర ద్వీపం హక్కైడోలోని హకోడేట్లో వేలాది చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. సముద్ర కెరటాలను కమ్మేసిన మృతి చెందిన చేపలు చూసిన అధికారులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ చేపలను తినకూడదని స్థానికులకు తెలిపారు. చేపల మరణానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ ఫుకుషిమా అణు కర్మాగారం నుంచి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలతో కూడిన నీటిని విడుదల చేయడమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. Massive number of dead fish washing up along the coast of northern Japan pic.twitter.com/xeCn4yv5xB— DeepCoverPatriot☦️ (@samuelculper3rd) December 7, 2023 ఈ ఏడాది అక్టోబర్‌లో జపాన్ ఫుకుషిమా అణు కర్మాగారం నుండి మురుగునీటిని విడుదల చేసింది. ఈ చర్యను చైనా ఖండించింది. 2011 నుండి సేకరించబడిన 1.34 మిలియన్ టన్నుల మురుగునీటిలో కొంత భాగాన్ని పసిఫిక్‌లోకి జపాన్ మొదటిసారి ఆగష్టు 24న విడుదల చేసింది. మార్చి 2011లో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా పవర్ ప్లాంట్ ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి -
Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట!
గత ఏడాది మేలో కరోనా ఉదృతి పెరిగినప్పుడు అమెరికాలో చాలామంది ఇళ్లకే పరిమితమయిన విషయం తెలిసిందే. ఆ టైంలో అమెరికాకు చెందిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కరోనా కేసులు అధికంగా ఉన్న రోజుల్లో ఆమె కేవలం మూడే అడుగుల దూరంలో 8 వారాలపాటు శవంతో గడిపింది. ఐతే ఆమెకు ఆవిషయమే తెలియదట. అసలేంజరిగిందంటే.. అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో రిగాన్ బెల్లీ అనే మహిళ ఒంటరిగా ఉంటోంది. ఒక రోజు హఠాత్తుగా తన అపార్ట్మెంట్లో దుర్వాసన రావడం ప్రారంభించింది. ఆ వాసనకి తలనొప్పి, రాత్రుల్లు నిద్రపట్టక ఆరోగ్యంకూడా బాగా పాడైపోయిందట. అంతేకాకుండా పురుగులు, సాలెపురుగులు విపరీతంగా పెరిగిపోయాయట. దీంతో ఆమె అపార్ట్మెంట్ మేనేజర్‌కి కంప్లైంట్ చేసింది. తనకు చనిపోయిన చేప వాసన వస్తోందని, కానీ దరిదాపుల్లో ఎక్కడా చెరువు లేకపోవడంతో, పక్కింటి కుక్క చచ్చిపోయిందేమోననే అనుమానం వ్యక్తం చేసింది. ఐతే వారిని అడిగితే కంగారు పడతారేమోనని మేనేజర్ చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! కొన్ని రోజుల తర్వాత ఆ దుర్వాసన భరించలేక మేనేజర్ని రప్పించి అపార్ట్మెంట్ బ్లాక్‌ను పరిశీలించడానికి ఒక వ్యక్తిని పురమాయించారు. ఐతే పక్క అపార్ట్మెంట్ నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో మెట్లు కూడా ఎక్కలేకపోయాడు సదరు వ్యక్తి. మాస్టర్ కీతో ఆ ఇంటి తలుపు తీయడంతో అస్థిపంజరంగా మారిన శవం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె రూం మరణించిన వ్యక్తి ప్లాట్‌కి కేవలం 3 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఆ రూంలో పడుకుంది కూడా. ఐతే ఆమెకు అసలు అక్కడ శవం ఉందనే విషయమే తెలియదట. ఆమె పక్క అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తి మరణించి రెండు నెలలౌతున్నా అసలెవ్వరూ గమనించకపోవడం కొసమెరుపు. కాగా రిగాన్ బెల్లీ టిక్‌టాక్ ద్వారా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా వెల్లడించింది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
మీనం.. మృత్యుతీరం
నరసాపురం రూరల్ : జిల్లాలోని తీర ప్రాంతం మృత్యు చేపలతో నిండిపోతోంది. భారీ సంఖ్యలో చేపలు కొట్టుకువస్తున్నాయి. కొద్దిరోజుల కిందట చెన్నై సమీపంలో రెండు నౌకలు ఢీ కొనడంతో చమురు భారీగా సముద్రంలో కలవడంతో జలాలు కలుషితమయ్యాయి. చమురు ప్రభావానికి సముద్రంలోని చేపలు భారీగా చనిపోయి కొట్టుకువస్తున్నాయి. నాలుగు రోజుల కిందట డాల్ఫిన్ లు, తాబేళ్లు కొట్టుకురాగా శనివారం భారీసంఖ్యలో చేపలు కొట్టుకొచ్చాయి. అంతేకాకుండా శనివారం మత్స్యకారుల ఐలు వలకు టన్నుల కొద్దీ మత్స్యసంపద చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీటిలో ఎక్కువ శాతం జెల్ల, గొరక జాతులకు చెందిన చేపలు ఉన్నట్టు మత్స్యకారులు తెలిపారు. వేములదీవి పెద్ద ఐలు వలకు చిక్కిన చేపలను రూ.1.5 లక్షలకు, మరో వలకు చిక్కిన చేపలను రూ.90 వేలకు విక్రయించారు. వీటిని కేవలం ఫీడ్ తయారీకి ఉపయోగిస్తారని తెలిపారు. కొట్టుకొచ్చిన చేపలతో తీరంలో దుర్వాసన వెదజల్లుతోంది. -
వినోదం కోసం ఇంత క్రూరత్వమా!
-
వినోదం కోసం ఇంత క్రూరత్వమా!
టోక్యో: జపాన్‌లోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్ నిర్వాహకులు చేసిన వినూత్న ఆలోచన విమర్శలకు దారితీసింది. సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగడంతో చివరికి ఆదివారం కిటాక్యుషులోని ఆ పార్క్‌ను మూసివేశారు. ఇంతకు వారికి తట్టిన ఆ ఆలోచన ఏంటంటే.. పార్క్‌లోని స్కేటింగ్ రింక్ పర్యాటకులను ఆకట్టుకునేలా ఉండాలని సుమారు 5000 చేపలను ఐస్‌లో అక్కడక్కడా ఉంచారు. 250 మీటర్ల పొడవున్న ఐస్ సర్క్యూట్లో 25 రకాల చేపలను పర్యాటకులకు కనిపించేలా ఏర్పాటుచేశారు. దీనిని చూసిన వారికి సముద్రంలోని చేపల్లా కనిపించాలని అలా చేశామని పార్కు నిర్వాహకులు తెలిపారు. ‘ఎట్రాక్షన్ నెవర్ హియర్డ్ అబౌట్’ అంటూ నిర్వాహకులు చేసిన ఈ ఘనకార్యం పర్యాటకులను ఆకట్టుకునే మాట అటుంచితే.. చనిపోయిన చేపలను అలా మంచులో చూడటం చాలా అసహజమైన, అభ్యంతరకరమైనరీతిలో ఉందని జంతుప్రేమికులు, నెటీజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయినా వినోదం కోసం ఇంత క్రూరత్వం అవసరమా అంటూ పెదవి విరిచారు.