AP Crime: Husband Brutally killed Wife At Tirupati - Sakshi
Sakshi News home page

Tirupati Crime: భర్తే ఆమె పాలిట సైకో కిల్లర్‌.. భార్యను చంపి డెడ్‌బాడీని సూట్‌కేసులో.. 

Published Tue, May 31 2022 11:31 AM | Last Updated on Tue, May 31 2022 12:42 PM

Husband Brutally killed Wife At Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: నగరంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఓ సైకో భర్త.. భార్యను దారుణంగా హత్య చేసి సూట్‌కేసులో మృతదేహాన్ని దాచిపెట్టి చెరువులో పడేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల ప్రకారం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వేణుగోపాల్‌కు, తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో 2019లో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. కాగా, వివాహమైన నాలుగు నెలలకే పద్మను భర్త చిత్ర హింసలకు గురిచేశాడు. ఆమెపై తన శాడిజాన్ని చూపించాడు. వేణుగోపాల్‌ వేధింపులు భరించలేక.. పద‍్మ తన పుట్టింటికి వెళ్లిపోయి భర్త నుంచి విడాకులు కోరింది. 

ఈ క్రమంలో కుటుంబ పెద్దలు అందరూ కలిసి.. భార్య, భర్తను కలిపేందుకు ప్రయత్నించారు. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. భర్త వేధింపులను గుర్తుకు తెచ్చుకున్న పద్మ.. తన కుటుంబ సభ్యులు ఎంత సర్ధిచెప్పినా వినిపించుకోలేదు. వేణుగోపాల్‌తో కలిసే బ్రతికే ప్రసక్తేలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో భార్యపై కోపం పెంచుకున్న శాడిస్ట్‌ భర్త.. పద్మను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సూట్ కేసులో పెట్టి రేణిగుంట మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ  చేపల చెరువులో పడేశాడు. 

అనంతరం.. పెద్ద ప్లాన్‌ వేశాడు. తన భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో పద్మ మృతదేహాన్ని వెలికితీశారు. 

ఇది కూడా చదవండి: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement