wife killed by husband
-
చిన్నాతో వివాహేతర సంబంధం.. భర్తపై పెట్రోల్ పోసి చంపిన భార్య
జగద్గిరిగుట్ట: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా, మట్టం గ్రామానికి చెందిన జయకృష్ణ(36), దుర్గా భవానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు నగరానికి వలసవచ్చి జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆల్విన్‌కాలనీ కమలాప్రసన్న నగర్లో నివాసం ఉంటున్నారు. జయకృష్ణ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. అయితే దుర్గా భవానీ గత కొన్నేళ్లుగా జయకృష్ణ స్నేహితుడు చందానగర్‌కు చెందిన చిన్నాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో 25 రోజుల క్రితం సొంత ఊరుకు వెళ్లిన జయకృష్ణ అక్కడే స్థిర పడాలని నిర్ణయించుకుని ఈ నెల 10న ఇంటిని ఖాళీ చేసి కుటుంబాన్ని తీసుకువెళ్లేందుకు నగరానికి వచ్చాడు. అయితే ఇది ఇష్టం లేని దుర్గాభవానీ ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని భావించి ప్రియుడు చిన్నాతో పథకం పన్నింది. ఇందులో భాగంగా జయకృష్ణకు ఫుల్లుగా మద్యం తాగించిన అనంతరం అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చుట్టు పక్కల వాళ్లను నమ్మించారు. మృతుడి తండ్రి తిరుమణి వడ్డికాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుర్గాభవానీ, చిన్నాలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. -
తిరుపతి: భార్యను హత్యచేసి చెరువులో పడేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
-
భర్తే ఆమె పాలిట సైకో కిల్లర్.. భార్యను చంపి డెడ్‌బాడీని సూట్‌కేసులో..
సాక్షి, తిరుపతి: నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ సైకో భర్త.. భార్యను దారుణంగా హత్య చేసి సూట్‌కేసులో మృతదేహాన్ని దాచిపెట్టి చెరువులో పడేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి వేణుగోపాల్‌కు, తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో 2019లో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. కాగా, వివాహమైన నాలుగు నెలలకే పద్మను భర్త చిత్ర హింసలకు గురిచేశాడు. ఆమెపై తన శాడిజాన్ని చూపించాడు. వేణుగోపాల్ వేధింపులు భరించలేక.. పద్మ తన పుట్టింటికి వెళ్లిపోయి భర్త నుంచి విడాకులు కోరింది. ఈ క్రమంలో కుటుంబ పెద్దలు అందరూ కలిసి.. భార్య, భర్తను కలిపేందుకు ప్రయత్నించారు. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. భర్త వేధింపులను గుర్తుకు తెచ్చుకున్న పద్మ.. తన కుటుంబ సభ్యులు ఎంత సర్ధిచెప్పినా వినిపించుకోలేదు. వేణుగోపాల్‌తో కలిసే బ్రతికే ప్రసక్తేలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో భార్యపై కోపం పెంచుకున్న శాడిస్ట్ భర్త.. పద్మను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సూట్ కేసులో పెట్టి రేణిగుంట మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ చేపల చెరువులో పడేశాడు. అనంతరం.. పెద్ద ప్లాన్ వేశాడు. తన భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో పద్మ మృతదేహాన్ని వెలికితీశారు. ఇది కూడా చదవండి: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం -
పాము కాటుతో భార్య మృతి.. భర్త అరెస్ట్
తిరువనంతపురం : కేరళలోని ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా పాము కాటుతో చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం భార్యను హత్య చేసిన నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న సూరజ్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం ఉత్తర అనే యువతితో వివాహం అయింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరు కొల్లంలో నివాసం ఉంటున్నారు. అయితే భార్య ఆస్తి మీద కన్నేసిన సూరజ్.. గత ఐదు నెలలుగా ఆమెను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాములు పట్టడంలో నేర్పరి అయిన తన స్నేహితుడు సురేశ్ సాయం కోరాడు. అతని సాయంతో ఫిబ్రవరిలో ఒకసారి ఉత్తరను పాము కాటు వేసేలా చేశాడు. అయితే సరైన సమయంలో చికిత్స అందడంతో ఉత్తర ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే మే తొలి వారంలో మరోసారి ఉత్తరను అంతమొందించాలని సురేశ్ నిర్ణయించుకున్నాడు. సురేశ్ వద్ద నుంచి పామును తీసుకుని.. మే 6వ తేదీ రాత్రి ఉత్తర బెడ్ రూమ్‌లో వదిలాడు. మరుసటి రోజు తెల్లవారేసరికి ఆమె మరణించారు. ఆ రోజు రాత్రి ఇంట్లోనే ఉన్న సురేశ్.. తనకేం తెలియదనట్టు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్టుగా నిర్ధారించారు. అయితే ఉత్తరను రెండుసార్లు పాము కాటు వేయడంపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె బంధువులు ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భార్య ఆస్తి కోసమే సూరజ్ పథకం ప్రకారం ఈ హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు సూరజ్ ఫోన్లో పాములకు సంబంధించిన వీడియోలు చూసినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
భార్య గొంతు కోసి హత్య
రాజేంద్రనగర్ : భార్యతో గొడవపడిన భర్త కత్తితో గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గండిపేట ప్రాంతానికి చెందిన గౌస్‌మోహీన్(35), గోల్కొండకు చెందిన షాహీన్‌బేగం(31)తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించి మూడు సంవత్సరాల క్రితం మృతిచెందాడు. వీరు గండిపేట మండల కార్యాలయం ప్రాంతంలో తన సొంత ఇంటిలో ఉంటున్నారు. మోహీన్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహించే వాడు. గత మూడు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఉద్యోగ విషయమై రోజూ షాహీన్‌బేగం, మోహీన్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. కాగా బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్కింటి వారు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా మంచంపై షాహీన్‌బేగం మృతిచెంది ఉంది. కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లుగా ఉంది. కత్తి పక్కనే ఉండడం.. మంచంపై పెనుగులాట జరిగిన అనవాళ్లు కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న గోడలపై నెత్తురు మరకలు పడి ఉన్నాయి. సంఘటనకు ముందు ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి నుంచి మోహీన్ జాడ లేకపోవడంతో అతడిపైనే అనుమానాలు ఉన్నాయ పోలీసులు తెలిపారు. డాగ్ స్వా్కడ్‌ను రప్పించిన పోలీసులు ఇంటి నుంచి రోడ్డుపై వరకు వెళ్లి ఆగిపోయాయి. రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యే నిందితురాలు..!
ప్రియుడి మోజులో పడి భర్తనే కాదనుకుంది.. నిత్యం వేధిస్తున్న భర్తను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుంది. తాగిన ఆదరమరచి నిద్రిస్తున్న వేళ ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టింది. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో చివరకు కటకటాలపాలైంది. నల్గొండ /కొండమల్లేపల్లి : హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను అంతమొందించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శివరాంరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. వివరాలు.. కొండమల్లేపల్లి మండల పరిధిలోని చెన్నారం గ్రామపంచాయతీ ఏపూర్‌తండాకు చెందిన రమావత్ సోమా (33)తో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన భారతితో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. సోమా వ్యవసాయంతో పాటు కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే కొంత కాలంగా సోమా తాగుడుకు బానిసగా మారి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో అతడి భార్య అదే తండాకు చెందిన శివతో సఖ్యతగా మెలుగుతోంది. ఈ విషయం సోమవాకు తెలియడంతో పలుమార్లు మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. మద్యం మత్తులో చనిపోయాడంటూ.. మరుసటి ఉదయం భారతి నమ్మబలికేందుకు కొత్త నాటకానికి తెరలేపింది. తన భర్త మద్యం మత్తులో ప్రాణాలు కొల్పోయాడంటూ అందరినీ నమ్మించేందుకు యత్నించింది. అయితే, దంపతుల మధ్య సఖ్యత కొరవవడం, అదే తండాకు చెందిన శివతో భారతి సఖ్యతగా మెలుగుతుండడం తండా వాసులకు అనుమానాల తావిచ్చింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భారతిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా నేరం అంగీకరించింది. ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు నేరం ఒప్పుకుంది. దీంతో శివను కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. కేసును ఛేదించిన ఐడీ పార్టీ సిబ్బంది హేమూనాయక్, ప్రభాకర్, రవీందర్, నరేశ్, సైదులులను సీఐ అభినందించారు. సమావేశంలో కొండమల్లేపల్లి, గుడిపల్లి ఎస్ఐలు శంకర్‌రెడ్డి, శ్రీనివాస్, ఏఎస్ఐ హన్మంతరావు, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, మల్లిఖార్జున్‌రావు తదితరులున్నారు. -
కూర బాగా వండలేదని...భార్యను హతమార్చిన భర్త
గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం: కూర బాగా వండలేదంటూ భర్త క్షణికావేశంతో కొట్టడంతో భార్య మృతి చెందిన ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో చోటుచేసుకుంది. ఎల్విన్‌పేట పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలం చినగీసాడ పంచాయతీ అచ్చబ గ్రామానికి చెందిన కోలక లక్ష్మణరావు సోమవారం సేకరించిన చింతపండును కురుపాం మండల కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించి సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి భోజనంలో వంటలు సరిగా వండలేదంటూ భార్య కోలక లక్ష్మమ్మ (44)తో ఘర్షణకు దిగాడు. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న వెదురుకర్రతో లక్ష్మమ్మ పొట్ట, వీపుపై బలంగా కొట్టాడు. వెంటనే స్పందించిన ఇరుగు పొరుగువారు కుప్పకూలిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో ఇంటి వద్దే ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో లక్ష్మమ్మ ఒంటిగంట సమయంలో మృతి చెందింది. మృతురాలి సోదరుడు మిన్నారావు మంగళవారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు ఎల్విన్‌పేట సీఐ జి.వేణుగోపాల్, ఎస్ఐ ఎస్.రాజు, పోలీసు సిబ్బంది అచ్చబ గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మమ్మకు ముగ్గురుకు కుమార్తెలు, ఒక కుమారుడు. వారందరికీ వివాహమైంది. సాయంత్రం వరకు తమతో ఉన్న లక్ష్మమ్మ భర్త చేతిలో హతమవ్వడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
ఇల్లాలే సూత్రధారి..!
కలకాలం తోడునీడగా ఉంటానని అతడితో తాళి కట్టించుకుని ఏడడుగులు నడిచింది.. పదేళ్లపాటు కాపురం చేసి ఇద్దరు బిడ్డలకు కూడా జన్మనిచ్చింది.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు భర్తనే కడతేర్చింది. ఇదీ.. కట్టంగూరు మండలం నారెగూడెంలో ఇటీవల వెలుగుచూసిన ఆదిలాబాద్ జిల్లా వాసి కృష్ణ హత్యోదంతం వెనుక ఉన్న కారణం. కట్టంగూర్ : ఆదిలాబాద్ జిల్లా వాసి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇల్లాలే సూత్రధారిగా వ్యవహరించి ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాలి గౌరారం సీఐ ప్రవీణ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడిం చారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెం దిన కొండబత్తుల క్రిష్ణ (31)తన భార్య ఉమతో కలిసి 4 నెలల క్రితం మండలంలోని నారెగూడెం గ్రా మశివారులో గల శ్యామల శేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలకు చె ందిన సుమారు 100 ఎకరాల మామిడి, బత్తాయి తోటలో జీతం కుదిరారు. వీరితో పాటు మరో మూడు కు టుం బాలు కూలీలుగా పనిచేస్తున్నారు. కట్టంగూర్కు చెం దిన మైనర్ (16) తన తల్లిదండ్రులతో కలిసి అదే తో టలో కూలీగా పనిచేస్తున్నాడు. కృష్ణ భార్య ఉమ సదరు పదహారేళ్ల బాలుడితో సన్నిహితంగా మెలగడంతో అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కలుసుకోలేకపోతున్నామని.. ఉమ కుటుంబం, సదరు బాలుడి కుటుంబ ఒకే తోట లో పనిచేస్తుండడంతో ఇద్దరికీ కలుసుకునేందుకు వీలు పడడం లేదు. ఇదే క్రమంలో ఇద్దరు చనువుగా మెలుగుతుండంతో కృష్ణకు అనుమానం వచ్చింది. దీం తో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని ఉమ పథకం రచించింది. పక్కా ప్రణాళితో.. రోజువారీ మాదిరిగానే ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఉమ తన భర్త కృష్ణను నారె గూడేనికి వెళ్లి ఇంటి సామగ్రి తెమ్మని పంపింది. ఇదే అదునుగా భర్తను హతమార్చేందుకు ప్రియుడు నాగరాజుకు తన ఇంట్లో ఉన్న కత్తిని ఇచ్చింది. కృష్ణ ఇంటి సామగ్రి తీసుకుని వస్తూ మార్గమధ్యలో కల్లు సేవించి స్కూటర్‌పై ఇంటికి వస్తున్నాడు. అప్పటికే పథకం ప్రకారం నాగరాజు, ఉమలు మార్గమధ్య లో కాపుకాస్తున్నారు. స్కూటర్‌పై వస్తున్న కృష్ణకు ఎదురుగా నాగరాజు వెళ్లి చాతిలో కత్తితో పొడవటంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఉమ బండరాయితో భర్త తలపై బలంగా మోదింది. దీంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యను ప్రమాదకరంగా చూపించేందుకు మృతదేహాన్ని, స్కూటర్‌ను సంఘటన స్థలం నుంచి 50 గజాల దూరంలో పడవేశారు.మృతుడు తమ్ముడు రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు బుధవారం తెల్లవారుజామున నారెగూడెం గ్రామస్తుల వద్దకు వెళ్లి హత్య చేసినట్లు ఒప్పుకుని లొంగిపోయాడు. నిందుతుడు మైనర్ కావటంతో నల్లగొండలోని యువైనల్ కోర్టుకు, నిందితురాలు ఉమను నకిరేకల్ మున్సిఫ్ కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సత్యనారాయణ, ఐడీ పార్టీ పోలీసులు మదు, యాసిన్ సిబ్బంది ఉన్నారు. -
పాలమూరు జిల్లాలో దారుణం
మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్నగర్ మండలం చెటాన్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య, కుమార్తె గొంతు కోసాడో కసాయి భర్త. ఆ ఘటనలో భార్య, కమార్తె రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. దాంతో నిందితుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్నవారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే భార్య మృతి చెందింది. కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానంతోనే భార్య, కుమార్తెపై భర్త దాడి చేశాడని పోలీసుల విచారణలో స్థానికులు వెల్లడించారు. -
భార్య గొంతుకోసిన భర్త
చిలకలగూడ,న్యూస్‌లైన్: అనుమానం పెనుభూతమైంది..విచక్షణ కోల్పోయి దారుణానికి దారితీసింది. బలవంతంగా భార్యతో మద్యం తాగించి కత్తితో గొంతుకోసి పరారయ్యాడు ఓ కసాయి భర్త. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు నిర్దారించారు. ఈ ఘాతుకానికి సంబంధించి బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం..ఖైరతాబాద్ చింతలబస్తీకి చెందిన భార్గవి (22), చిలకలగూడ భవానీనగర్‌కు చెందిన రాజేష్ (27)లు గతేడాది జూలైలో ప్రేమ వివాహం చేసుకుని సీతాఫల్మండి మేడిబావిలో ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. పెయింటింగ్ పనులు చేసే రాజేష్ భార్యపై అనుమానం పెంచుకొని కొంతకాలంగా వేధిస్తున్నాడు. వీటిని తాళలేక భార్గవి కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోగా..ఇకనుంచి బాగా చూసుకుంటానని ప్రాధేయపడడంతో తల్లిదండ్రులు భార్గవిని రాజేశ్‌తో పంపించారు. అయినా రాజేష్ ప్రవర్తనలో మార్పురాలేదు. సోమవారం రాత్రి 8 గం.ల సమయంలో రాజేష్ తన మిత్రుడు వాసుతో కలిసి మద్యం తీసుకొని ఇంటికొచ్చి ఇద్దరూ మద్యం సేవించారు. కాసేపటి తర్వాత రాజేశ్ తనవద్దున్న మద్యాన్ని బలవంతంగా భార్గవికి తాగించగా ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కూరగాయలు తరిగే చాకుతో భార్గవి గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిన రాజేష్ అక్కడినుంచి పరారయ్యాడు. అపస్మారకస్థితినుంచి బయటపడిన భార్గవి స్థానికుల సహాయంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. శస్త్రచికిత్స చేసిన వైద్యులు ప్రాణాపాయంలేదని చెప్పడంతో బాధితురాలు మంగళవారం తల్లిదండ్రులతో కలిసి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.