ఇల్లాలే సూత్రధారి..!
కలకాలం తోడునీడగా ఉంటానని అతడితో తాళి కట్టించుకుని ఏడడుగులు నడిచింది.. పదేళ్లపాటు కాపురం చేసి ఇద్దరు బిడ్డలకు కూడా జన్మనిచ్చింది.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు భర్తనే కడతేర్చింది. ఇదీ.. కట్టంగూరు మండలం నారెగూడెంలో ఇటీవల వెలుగుచూసిన ఆదిలాబాద్ జిల్లా వాసి కృష్ణ హత్యోదంతం వెనుక ఉన్న కారణం.
కట్టంగూర్ : ఆదిలాబాద్ జిల్లా వాసి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇల్లాలే సూత్రధారిగా వ్యవహరించి ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాలి గౌరారం సీఐ ప్రవీణ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడిం చారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెం దిన కొండబత్తుల క్రిష్ణ (31)తన భార్య ఉమతో కలిసి 4 నెలల క్రితం మండలంలోని నారెగూడెం గ్రా మశివారులో గల శ్యామల శేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలకు చె ందిన సుమారు 100 ఎకరాల మామిడి, బత్తాయి తోటలో జీతం కుదిరారు. వీరితో పాటు మరో మూడు కు టుం బాలు కూలీలుగా పనిచేస్తున్నారు. కట్టంగూర్‌కు చెం దిన మైనర్ (16) తన తల్లిదండ్రులతో కలిసి అదే తో టలో కూలీగా పనిచేస్తున్నాడు. కృష్ణ భార్య ఉమ సదరు పదహారేళ్ల బాలుడితో సన్నిహితంగా మెలగడంతో అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
కలుసుకోలేకపోతున్నామని..
ఉమ కుటుంబం, సదరు బాలుడి కుటుంబ ఒకే తోట లో పనిచేస్తుండడంతో ఇద్దరికీ కలుసుకునేందుకు వీలు పడడం లేదు. ఇదే క్రమంలో ఇద్దరు చనువుగా మెలుగుతుండంతో కృష్ణకు అనుమానం వచ్చింది. దీం తో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని ఉమ పథకం రచించింది.
పక్కా ప్రణాళితో..
రోజువారీ మాదిరిగానే ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఉమ తన భర్త కృష్ణను నారె గూడేనికి వెళ్లి ఇంటి సామగ్రి తెమ్మని పంపింది. ఇదే అదునుగా భర్తను హతమార్చేందుకు ప్రియుడు నాగరాజుకు తన ఇంట్లో ఉన్న కత్తిని ఇచ్చింది. కృష్ణ ఇంటి సామగ్రి తీసుకుని వస్తూ మార్గమధ్యలో కల్లు సేవించి స్కూటర్‌పై ఇంటికి వస్తున్నాడు. అప్పటికే పథకం ప్రకారం నాగరాజు, ఉమలు మార్గమధ్య లో కాపుకాస్తున్నారు. స్కూటర్‌పై వస్తున్న కృష్ణకు ఎదురుగా నాగరాజు వెళ్లి చాతిలో కత్తితో పొడవటంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఉమ బండరాయితో భర్త తలపై బలంగా మోదింది.
దీంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యను ప్రమాదకరంగా చూపించేందుకు మృతదేహాన్ని, స్కూటర్‌ను సంఘటన స్థలం నుంచి 50 గజాల దూరంలో పడవేశారు.మృతుడు తమ్ముడు రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు బుధవారం తెల్లవారుజామున నారెగూడెం గ్రామస్తుల వద్దకు వెళ్లి హత్య చేసినట్లు ఒప్పుకుని లొంగిపోయాడు. నిందుతుడు మైనర్ కావటంతో నల్లగొండలోని యువైనల్ కోర్టుకు, నిందితురాలు ఉమను నకిరేకల్ మున్సిఫ్ కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ సత్యనారాయణ, ఐడీ పార్టీ పోలీసులు మదు, యాసిన్ సిబ్బంది ఉన్నారు.