భార్య గొంతుకోసిన భర్త | wife head cutted by husband | Sakshi
Sakshi News home page

భార్య గొంతుకోసిన భర్త

Published Wed, Feb 19 2014 5:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

wife head cutted by husband

 చిలకలగూడ,న్యూస్‌లైన్:
 అనుమానం పెనుభూతమైంది..విచక్షణ కోల్పోయి దారుణానికి దారితీసింది. బలవంతంగా భార్యతో మద్యం తాగించి కత్తితో గొంతుకోసి పరారయ్యాడు ఓ కసాయి భర్త. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు నిర్దారించారు. ఈ ఘాతుకానికి సంబంధించి బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం..ఖైరతాబాద్ చింతలబస్తీకి చెందిన భార్గవి (22), చిలకలగూడ భవానీనగర్‌కు చెందిన రాజేష్ (27)లు  గతేడాది జూలైలో ప్రేమ వివాహం చేసుకుని సీతాఫల్‌మండి మేడిబావిలో ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు.
 
  పెయింటింగ్ పనులు చేసే రాజేష్ భార్యపై అనుమానం పెంచుకొని కొంతకాలంగా వేధిస్తున్నాడు. వీటిని తాళలేక భార్గవి కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోగా..ఇకనుంచి బాగా చూసుకుంటానని ప్రాధేయపడడంతో తల్లిదండ్రులు భార్గవిని రాజేశ్‌తో పంపించారు. అయినా రాజేష్ ప్రవర్తనలో మార్పురాలేదు. సోమవారం రాత్రి 8 గం.ల సమయంలో రాజేష్ తన మిత్రుడు వాసుతో కలిసి మద్యం తీసుకొని ఇంటికొచ్చి ఇద్దరూ మద్యం సేవించారు. కాసేపటి తర్వాత రాజేశ్ తనవద్దున్న మద్యాన్ని బలవంతంగా భార్గవికి తాగించగా ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కూరగాయలు తరిగే చాకుతో భార్గవి గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిన రాజేష్ అక్కడినుంచి పరారయ్యాడు. అపస్మారకస్థితినుంచి బయటపడిన భార్గవి స్థానికుల సహాయంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. శస్త్రచికిత్స చేసిన వైద్యులు ప్రాణాపాయంలేదని చెప్పడంతో బాధితురాలు మంగళవారం తల్లిదండ్రులతో కలిసి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement