భార్యే నిందితురాలు..! | Wife Kills Husband | Sakshi
Sakshi News home page

భార్యే నిందితురాలు..!

Published Tue, Jan 2 2018 9:10 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

Wife Kills Husband - Sakshi

ప్రియుడి మోజులో పడి భర్తనే కాదనుకుంది.. నిత్యం వేధిస్తున్న భర్తను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుంది. తాగిన ఆదరమరచి నిద్రిస్తున్న వేళ ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టింది. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో చివరకు కటకటాలపాలైంది.  

నల్గొండ /కొండమల్లేపల్లి : హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను అంతమొందించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శివరాంరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. వివరాలు..  కొండమల్లేపల్లి మండల పరిధిలోని చెన్నారం గ్రామపంచాయతీ ఏపూర్‌తండాకు చెందిన రమావత్‌ సోమా (33)తో నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చెందిన భారతితో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. సోమా వ్యవసాయంతో పాటు కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే కొంత కాలంగా సోమా తాగుడుకు బానిసగా మారి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో అతడి భార్య అదే తండాకు చెందిన శివతో సఖ్యతగా మెలుగుతోంది. ఈ విషయం సోమవాకు తెలియడంతో పలుమార్లు మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 

మద్యం మత్తులో చనిపోయాడంటూ..
మరుసటి ఉదయం భారతి నమ్మబలికేందుకు కొత్త నాటకానికి తెరలేపింది. తన భర్త మద్యం మత్తులో ప్రాణాలు కొల్పోయాడంటూ అందరినీ నమ్మించేందుకు యత్నించింది. అయితే, దంపతుల మధ్య సఖ్యత కొరవవడం, అదే తండాకు చెందిన శివతో భారతి సఖ్యతగా మెలుగుతుండడం తండా వాసులకు అనుమానాల తావిచ్చింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భారతిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా నేరం అంగీకరించింది. ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు నేరం ఒప్పుకుంది. దీంతో శివను కూడా అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. కేసును ఛేదించిన ఐడీ పార్టీ సిబ్బంది హేమూనాయక్, ప్రభాకర్, రవీందర్, నరేశ్, సైదులులను సీఐ అభినందించారు. సమావేశంలో కొండమల్లేపల్లి, గుడిపల్లి ఎస్‌ఐలు శంకర్‌రెడ్డి, శ్రీనివాస్, ఏఎస్‌ఐ హన్మంతరావు, పోలీస్‌ సిబ్బంది శ్రీనివాస్, మల్లిఖార్జున్‌రావు తదితరులున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement