దుమ్ముగూడెం(తెలంగాణ): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిరిసెట్టి సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సిమెల్, గోగుండా కొండలపై పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ బలగాలు గాలింపు చేపట్టాయి.
గురువారం రాత్రి భద్రతా బలగాలు కూంబింగ్ ముగించుకుని వస్తుండగా కోడెల్‌పరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాడి చేశారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా, మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే పారిపోయారు. అనంతరం ఘటనాస్థలంలో ఓ మావోయిస్టు మృతదేహంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమయ్యా యని, మరో ఐదుగురు మావోయిస్టులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment