నువ్వులేక నేను లేను..! | Nuvvu Leka Nenu lenu | Sakshi
Sakshi News home page

నువ్వులేక నేను లేను..!

Published Thu, Apr 28 2016 4:16 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

నువ్వులేక నేను లేను..!

నువ్వులేక నేను లేను..!

వెనిగండ్ల (పెదకాకాని): నువ్వు లేని జీవితం నాకిక వద్దు అనుకున్నదేమో ఆ మహా ఇల్లాలు భర్త చనిపోయిన 24 గంటల్లోనే తానూ తనువు చాలించింది. మం డల పరిధిలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన మున్నంగి గోపిరెడ్డి ఈ నెల 15న చెయ్యి కడుక్కునే క్రమంలో కాలుజారి కాలుతున్న బండ్లపై పడ్డాడు. కొద్ది సేపటి వరకు అక్కడే ఉండటంతో శరీరం కొంతభాగం కాలి బొబ్బలు వచ్చాయి. దీనిని గమనించిన కుటుంబ సభ్యు లు స్థానిక వైద్యులచే ఆయనకు చికిత్స చేరుుంచారు. ఆ తరువాత కొద్ది రోజులకు భార్య పుల్లమ్మ కూడా భర్తపై దిగులతో అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలిం చారు. ఈ క్రమంలో ఇంటి వద్ద చికిత్స పొందుతున్న భర్త మున్నంగి గోపిరెడ్డి (92) ఈ నెల 25న రాత్రి మృతి చెందాడు. దీంతో డాక్టర్ అనుమతి తీసుకొని భర్త గోపిరెడ్డి మృతదేహాన్ని చివరిసారిగా చూసేందుకు భార్య పుల్లమ్మను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చా రు.

26న భర్త అంత్యక్రియలు పూర్తి అయ్యా యి. భర్త మృతితో పుల్లమ్మ ఆవేదనతో కుమిలిపోయింది. భర్తను తలచుకుంటూ అదే రోజు రాత్రి తానూ ఈ లోకాన్ని వీడింది. ఆ దంపతులకు  ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా రు. ఆ వృద్ధ దంపతులు మనవళ్లు, మనవరాళ్లతోపాటు ముది మనవళ్లు, మనవరాళ్లను కూడా చూసుకున్నారు. బుధవారం పెద్ద ఎత్తున బం దువులు వెనిగండ్ల గ్రామానికి చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement