ఇల్లెందు : తమ కుమారుడి ఆత్మహత్యకు కారకుడైన దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ మృతదేహంతో కుటుంబీకులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఇల్లెందులోని 17వ వార్డుకు చెందిన కొమ్ము వెంకటేష్(23) శనివారం సాయంత్రం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు గత 12 ఏళ్లుగా ఇల్లెందులోని ఇద్దరు వ్యాపారుల వద్ద షాపు గుమస్తాగా పనిచేస్తున్నాడు. అనివార్య కారణాలతో వారం రోజులపాటు షాపుకు వెళ్లలేదు. శనివారం వెళ్లాడు. అతనిని యజమానులు దూషించడంతో ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో కుటుంబీకులు నేరుగా జగదాంబ సెంటర్‌లో వెళ్లి అక్కడ రాస్తారోకోకు దిగారు. వీరికి సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులు ఐతా సత్యం, పోట్ల నాగేశ్వరావు వివరాలు తెలుకున్నారు. ఆందోళన కారులను సీఐ సారంగపాణి శాంతింపచేశారు.
Comments
Please login to add a commentAdd a comment