కూతుర్ని అవమానిస్తున్నాడని ప్రియుడిని.. | Woman Kills Boyfriend In Meerut | Sakshi
Sakshi News home page

కూతుర్ని అవమానిస్తున్నాడని ప్రియుడిని..

Published Sat, Apr 27 2019 9:01 AM | Last Updated on Sat, Apr 27 2019 9:08 AM

Woman Kills Boyfriend In Meerut - Sakshi

మీరట్‌ : కన్న కూతుర్ని హేళనచేస్తూ.. అవమానకరంగా మాట్లాడుతున్నాడన్న కోపంతో ప్రియుడిని గొంతునులిమి చంపేసిందో మహిళ. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్‌లోని ఔరంగ్‌షాపూర్‌కు చెందిన షమీమ్‌ అనే మహిళ భర్త చనిపోవటంతో కూతురితో కలిసి మీరట్‌ ఉంటోంది. ఇద్దరు మీరట్‌లోని ఓ ఫామ్‌లో కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీమ్‌కు రాజీవ్‌ అలియాస్‌ రాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అదే ఫామ్‌లో పనిచేసే ముసాహిద్‌ అనే యువకుడికి షమీమ్‌ కూతురితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

షమీమ్‌ కూతురు ముసాహిద్‌తో కలిసి తిరగటం ఇష్టంలేని రాజీవ్‌ ఆ యువతిని అవమానకరంగా మాట్లాడేవాడు. ఈ విషమై ముసాహిద్‌కి రాజీవ్‌కు మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. తన కూతుర్ని, తనను సైతం అందరి ముందు అవమానిస్తున్నాడని తట్టుకోలేకపోయింది షమీమ్‌. ఎలాగైనా అతడి అడ్డుతొలగించుకోవాలని భావించి, ముసాహిద్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ఏప్రిల్‌ 22వ తేది రాత్రి అతడికి ఫుల్లుగా మధ్యం తాగించి గొంతు నులిమి చంపారు. పోలీసు దర్యాప్తులో షమీమ్‌, ముసాహిద్‌లే హత్య చేశారని తేలటంతో వారిని అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement