ఆసిఫాబాద్‌లో ఎన్‌కౌంటర్‌ | Two Maoists Killed In Encounter At Asifabad | Sakshi
Sakshi News home page

ఆసిఫాబాద్‌లో ఎన్‌కౌంటర్‌

Published Sun, Sep 20 2020 4:13 AM | Last Updated on Sun, Sep 20 2020 8:58 AM

Two Maoists Killed In Encounter At Asifabad - Sakshi

సాక్షి, మంచిర్యాల : పచ్చటి అడవి కాల్పులతో దద్ద రిల్లింది. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుమురంభీం– ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కదంబా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయి స్టులకు మధ్య ఎదురు కాల్పులు జరి గాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయి నట్లు తెలుస్తోంది. దట్టమైన అడవిలో, పులులకు ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం. రాత్రివేళ కావడం, భారీ వర్షం కురుస్తుం డటంతో మృతదేహాల గుర్తింపు ఆలస్యమవు తోంది. మృతుల్లో వర్గీస్‌ ఉన్నట్లు ప్రాథమి కంగా నిర్ధారణ అవుతోంది.

చనిపోయిన మరొ కరు మహిళా మావోయిస్టు అని సమా చారం. మరో ఇద్దరు కూడా మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో ఏకే 47 స్వాధీన పర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావో యిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. 25 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్‌ తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. కుమురం భీం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ, రామగుండం పోలీసు కమిషనర్‌ వి.సత్యనారా యణ, ఏఎస్పీ సుధీంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మొత్తం ఎనిమిది గ్రేహౌండ్స్‌ బృందాలు, ఆరు స్పెషల్‌ పార్టీలు పాల్గొన్నాయి. ఇంకా కుంబింగ్‌ కొనసాగుతుండంతో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసుల దగ్గరగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఐదుగురు దళ సభ్యులను చట్టుముట్టి మూడు అంచెల్లో దిగ్బంధం చేసినట్లు సమాచారం. మృతి చెందిన వర్గీస్‌ ఇటీవలి నియామకాల్లో ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి ఏరియా కమిటీ సారథిగా నియమితులయ్యారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయనపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది. 

పక్కా సమాచారంతో దాడి
మావోల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పక్క సమాచారంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ సమీప అటవీ ప్రాంతాల్లో బలగాలు కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. శుక్రవారం ఆసిఫాబాద్‌ మండలం చిలాటిగూడలో సంచరించినట్లు సమాచారం రావడంతో గాలింపు మరింత ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేబీఎం (కుమురం భీం మంచిర్యాల) డివిజన్‌ కార్యదర్శి మైలరపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ నేతృత్వంలోని ఐదుగురు దళ సభ్యులు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం నుంచి మహారాష్ట్ర నుంచి ప్రాణహిత మీదుగా కొన్నాళ్ల కిందట ఆసిఫాబాద్‌లో ప్రవేశించారు. వారి కదలికలు గుర్తించిన పోలీసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. గత నెలలో తిర్యాణి మండలం టొక్కిగూడ అడవుల్లో కాల్పులు జరగగా మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి మరింత ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ నెల 2న ఆసిఫాబాద్‌ చేరుకున్న డీజీపీ మహేందర్‌ రెడ్డి ఐదురోజుల పాటు ఇక్కడే మకాం వేశారు. మావోయిస్టుల ఆపరేషన్‌పై స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. 

తిరిగివెళ్లిపోతున్నారా? 
మావోయిస్టుల ఉనికిని ఎప్పటికప్పుడు పోలీసులు పసిగడుతుండటంతో తిరిగి దండకారణ్యంలోకి వెళ్లే క్రమంలోనే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం మహారాష్ట్రకు వెళ్లే దారిలో ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇన్నాళ్లు కొమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన తిర్యాణి, జన్నారం, ఊట్నూరు, నేరడిగొండ ప్రాంతాల్లో పలుమార్లు దళ సభ్యుల కదలికలను పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ అటవీ ప్రాంతంలో దళ సభ్యులు సంచరిస్తున్నట్లు గుర్తించగా... తాజాగా ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయే క్రమంలోనే ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement