
సాక్షి, విశాఖపట్నం: ‘దిశ’ కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం పట్ల బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చట్టాల్లో మార్పులు రావాలని, మహిళలపై దారుణాలకు పాల్పడే వారిని పబ్లిక్‌గ్గా ఉరితీసే చట్టంతో పాటు, పబ్లిక్‌గా షూట్ చేసే చట్టం కూడా రావాలన్నారు. రెండు నెలల్లో ఇలాంటి కేసులను క్లోజ్ చేసేలా చట్టం రూపొందించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, డే టూడే గానో కాలపరిమితి విధించి రెండు నెలల్లో నిందితులను ఉరితీసే విధంగా చట్టం చేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు.
(చదవండి: నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి: చిరంజీవి)
Comments
Please login to add a commentAdd a comment