
రాజ్‌నంద్‌గావ్: ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇండో–టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ), జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పక్కా సమాచారం ప్రకారం ఖద్‌గావ్ గ్రామ శివార్లలో కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు.
పోలీసుల ఎదురుకాల్పుల్లో పల్లెమాడి స్థానిక కార్యక్రమాల బృందం (ఎల్‌వోఎస్) కమాండర్ రాకేశ్ దుగ్గ, డిప్యూటీ కమాండర్ రంజిత్ నురేటితోపాటు మరో మావోయిస్టు మహేశ్ పోతావి హతమైనట్లు పోలీసులు తెలిపారు. 2009లో 29 మంది సీఆర్పీఎఫ్ పోలీసులను చంపిన కేసులో రాకేశ్, రంజిత్ కీలకంగా వ్యవహరించారని భావిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.