శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్‌లోని చేవా ఉల్లార్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ప్రారంభమైన ఈ కాల్పులు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. త్రాల్ సెక్టార్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు నిఘా వర్గాల నుంచి పోలీసులకు, సీఆర్పీఎఫ్ బృందాలకు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైనిక దళాల కదలికలలను గుర్తించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.దీంతో ఉగ్రవాదులపై బలగాల ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గరు ఉగ్రవాదులు మరణించారు. (కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి)
ఈ కాల్పులపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టినట్లు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సాయుధ దళాల సిబ్బందికి కూడా గాయాలయ్యాని వెల్లడించారు. కాగా కాల్పుల్లో మరణించిన ముగ్గురు ఉగ్రవారులు స్థానికి ట్రాల్ ప్రాంతానికి చెందిన వారని, ఆయుధాలతో ఉగ్రవాదంలో చేరినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ నెలలో ఇది దక్షిణ కశ్మీర్‌లో జరిగిన 12వ ఎన్‌కౌంటర్. ఇప్పటి వరకు 33 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. (భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment