militants died
-
పుల్వామాలో ఎన్కౌంటర్; ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్‌లోని చేవా ఉల్లార్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ప్రారంభమైన ఈ కాల్పులు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. త్రాల్ సెక్టార్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు నిఘా వర్గాల నుంచి పోలీసులకు, సీఆర్పీఎఫ్ బృందాలకు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైనిక దళాల కదలికలలను గుర్తించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.దీంతో ఉగ్రవాదులపై బలగాల ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గరు ఉగ్రవాదులు మరణించారు. (కశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి) ఈ కాల్పులపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఎన్కౌంటర్లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టినట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సాయుధ దళాల సిబ్బందికి కూడా గాయాలయ్యాని వెల్లడించారు. కాగా కాల్పుల్లో మరణించిన ముగ్గురు ఉగ్రవారులు స్థానికి ట్రాల్ ప్రాంతానికి చెందిన వారని, ఆయుధాలతో ఉగ్రవాదంలో చేరినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ నెలలో ఇది దక్షిణ కశ్మీర్లో జరిగిన 12వ ఎన్కౌంటర్. ఇప్పటి వరకు 33 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. (భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు) -
ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదుల హతం
అనంత్‌నాగ్ : జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని ఆదివారం భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదులను హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని డయాల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిర్థిష్ట సమాచారంతోనే ఆదివారం ఉదయం భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. తర్వాత ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు తమ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారి తెలిపారు. -
ఈజిప్టులో కాల్పుల కలకలం... 34 మంది మృతి
కైరో: ఈజిప్టులో మిలిటెంట్లు మరోసారి విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో ఆర్మీ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపింది. అయితే కనీపం 30 మంది మిలిటెంట్లు, నలుగురు సిబ్బంది మృతిచెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈజిప్టులోని ఉత్తర సినాయ్ సరిహద్దులోని షేక్ జువైద్ చెక్ పోస్ట్ లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు గురువారం అర్ధరాత్రి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ సిబ్బంది ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బంది చనిపోగా, 30 మంది మిలిటెంట్లు హతమయ్యారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. కాల్పుల ఘటనలో మొత్తంగా ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. అంతర్జాతీయ తీర సరిహద్దుగల అబు రాఫేయ్ షేక్ జవైద్ నగరం గుండా వెళ్తోంది. దీంతో మిలిటెంట్లు తమ అవసరార్థం ఆ చుట్టుప్రక్కల గ్రామస్తులను అక్కడి నుంచి పంపించివేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దాడి జరిగినరోజు అరిష్ నగరంలో ఓ స్కూలు సమీపంలో బాంబును నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఈజిప్టులో 2013 జూలై నుంచి కొనసాగుతున్నాయి. దీంతో వేల మంది పోలీసులు, ఆర్మీ సిబ్బంది, సామాన్యులు ఉగ్రమూకల చర్యలతో బలవుతూనే ఉన్నారు.