
కశ్మీర్: కుల్గాంలోని నాగ్‌నధ్-చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు, 9 మంది పీఆర్, సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నాగ్‌నద్-చిమ్మర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు ఆయన వెల్లడించారు. భద్రతా బలగాలు అక్కడకు చేరుకోగానే నక్కి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో పోలీసులు, జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
చదవండి: కశ్మీర్‌లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్
#KulgamEncounterUpdate: Another #unidentified #terrorist killed (total 03). #Incriminating materials including #arms & #ammunition recovered. Search going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/L74a825FBw
— Kashmir Zone Police (@KashmirPolice) July 17, 2020
Comments
Please login to add a commentAdd a comment