భద్రాద్రిలో భారీ ఎన్‌కౌంటర్‌ | A huge encounter in Bhadrachri | Sakshi
Sakshi News home page

భద్రాద్రిలో భారీ ఎన్‌కౌంటర్‌

Published Fri, Dec 15 2017 3:21 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

A huge encounter in Bhadrachri - Sakshi

సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. జిల్లాలోని టేకులపల్లి మండలం చింతోనిచెలక–మేళ్లమడుగు గ్రామా ల శివార్లలోని కోడెవాగు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయి స్టులు మృతిచెందారు. వీరిని సీపీఐ(ఎంఎల్‌) చండ్ర పుల్లారెడ్డి బాట దళానికి చెందినవారిగా గుర్తించారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇది భారీ ఎన్‌కౌంటర్‌ కావడం గమనార్హం.

పక్కా సమాచారంతో..
టేకులపల్లి మండలంలోని కోడెవాగు వద్ద 16 మంది సాయుధ మావోయిస్టులు సంచరిస్తు న్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దాంతో బోడు ఎస్సై అనిల్‌ గురు వారం తెల్లవారుజామున తన బృందంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌం టర్‌ జరిగింది.

గాలింపు సందర్భంగా మావో యిస్టులు కనబడటంతో లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారని.. కానీ మావో యిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని భద్రాద్రి కొత్త గూడెం ఎస్పీ అంబర్‌కిషోర్‌ ఝా చెప్పారు. దీంతో 8 మంది మావోయిస్టులు మృతి చెందా రని, మరికొందరు తప్పించుకుని ఉంటారని తెలిపారు. ఘటనా స్థలంలో ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ, మూడు 8 ఎంఎం రైఫిల్స్, రెండు ఎస్‌బీబీఎల్‌ తుపాకులతో పాటు కిట్‌ బ్యాగు లు, టార్పాలిన్లు, వాటర్‌ జర్కిన్లు, విప్లవ సాహిత్యం లభించినట్లు వెల్లడించారు.

దళం ఏర్పాటై ఐదు నెలలే..
సీపీఐ (ఎంఎల్‌) చండ్ర పుల్లారెడ్డి బాట (సీపీ బాట) వామపక్ష దళం ఈ ఏడాది జూలై 24వ తేదీనే ఏర్పాటైంది. వివిధ వామపక్ష తీవ్రవాద పార్టీల్లో పనిచేసినవారు కలసి దీన్ని స్థాపిం చారు. ఈ దళంలో 18 నుంచి 20 మంది వరకు సభ్యులున్నట్లు తెలుస్తోంది. వీరు బెదిరిం పులు, వసూళ్లకు పాల్పడుతుండడంతో పోలీ సులు గట్టి నిఘా పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో దళానికి చెందిన షేర్‌ మధుతో పాటు ముగ్గురు సభ్యులు లొంగిపోయారు. మరో సభ్యుడిని పాల్వంచ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఎనిమిది మంది మృతి చెందగా.. ఇంకా 6 నుంచి 8 మంది వరకు సభ్యులున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

అంతా 35 ఏళ్లలోపు వారే..
గురువారం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ïసీపీఐ(ఎంఎల్‌) చండ్ర పుల్లారెడ్డి బాట దళ సభ్యులంతా 35 ఏళ్లలోపువారే. వీరిలో ఏడు గురిని గుర్తించారు. వారి వివరాలివీ...
సీపీ బాట దళ కమాండర్‌గా వ్యవహరించిన ఎట్టి కుమార్‌ (35) అలియాస్‌ శ్రీను అలియాస్‌ రాఖీ భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మర్రిగూడేనికి చెందినవారు. గతంలో సీపీఐలో పనిచేసి వార్డు సభ్యుడిగా చేశాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు న్నారు. ఆరేళ్ల కింద ఇల్లు వదిలి వెళ్లిపోయిన కుమార్‌పై నాలుగు కేసులున్నాయి.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేటకు చెందిన జక్కటి ప్రవీణ్‌కుమార్‌ (24) అలియాస్‌ ఆజాద్‌ 20 రోజుల కిందే ఈ దళంలో చేరాడు. ఆయన భూపాలపల్లి జిల్లా మంగపేట ఏరియా బాధ్యతలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన నూనావత్‌ అర్జున్‌ (22) అలియాస్‌ నవీన్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. కొంతకాలం అశ్వాపురం మండలం గొందిగూడెంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేశాడు. మూడు నెలల కింద సీపీబాట దళంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు.
మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామానికి చెందిన బోయిన ఓంప్రకాశ్‌ (22) అలియాస్‌ గణేశ్‌ ఆర్‌ఎంపీగా పనిచేసేవాడు. ఆయన సోదరుడు ఐలయ్య గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయారు. ఓంప్రకాశ్‌ కూడా గతంలో పీడీఎస్‌యూలో పనిచేశాడు. ఆరునెలల కింద సీపీ బాట దళంలో చేరాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కొడవటంచ గ్రామానికి చెందిన ఈసం నరేశ్‌ (30) అలియాస్‌ సుదర్శన్‌ ప్రముఖ ఎన్‌డీ నేత బాటన్న మనవడు. 2004లో జనశక్తి నుంచి విడిపోయిన సీపీయూఎస్‌ఐలో పనిచేశాడు. తర్వాత సీపీఐ అనుబంధ ఏఐఎస్‌ఎఫ్‌లో పని చేశాడు. ఈ క్రమంలో పలువురి నుంచి వసూళ్లకు పాల్పడుతూ అరెస్టయ్యాడు. సీపీ బాట దళంలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుం డాల మండల కేంద్రానికి చెందిన తిరుకుల్లూరి మధు (35) గతంలో సీపీయూఎస్‌ఐలో పనిచేశాడు. 2006లో బయటకు వచ్చేశాడు. గుండాలలో వెల్డింగ్‌ షాపు నడుపుతూ కాలం వెల్లదీశాడు. సీపీ బాట దళం ఆవిర్భావ సమయంలో అందులో చేరాడు.
 టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామా నికి చెందిన గాడిదల శ్రీను. (ఈయనను బంధువులు గుర్తించారు. పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు). మరో దళ సభ్యుడికి సంబంధించిన వివరాలు తెలియలేదు.


ఎన్‌కౌంటర్‌ బూటకం
తెలంగాణ ఉద్యమ సమయంలో నక్సలైట్ల ఎజెండానే తన ఎజెండా అని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజా గాయకుడు గద్దర్‌ విమర్శించారు. కోడెవాగు ఎన్‌కౌంటర్‌ బూటకమని, దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకుడు గుమ్మడి నర్సయ్య, ఇల్లెందు జెడ్పీటీసీ చండ్ర అరుణ పేర్కొన్నారు. ఏజెన్సీలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్రభుత్వం ప్రజలను ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. – గద్దర్, గుమ్మడి నర్సయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement