ముగ్గురు జవాన్ల వీర మరణం | CRPF Jawans Lost Their Breath In Gun Battle Handwara | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ వేళ రెచ్చిపోయిన ఉగ్రమూక

Published Mon, May 4 2020 7:56 PM | Last Updated on Mon, May 4 2020 8:15 PM

CRPF Jawans Lost Their Breath In Gun Battle Handwara - Sakshi

శ్రీనగర్‌ : దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో ఉగ్రమూకలు ఇదే అదనుగా రెచ్చిపోతున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఉగ్రవాదులతో పోరాడుతూ ఐదుగురు జవాన్లు మరణించిన ఘటన మరువకముందే అదే ప్రాంతంలో మరో విషాదం చోటుచేసుకుంది. హంద్వారా ప్రాంతంలోని క్వాజిబాద్‌ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు నేలకొరిగారు. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. మిలిటెంట్లను వేటాడే ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాగా, శనివారం సాయంత్రం ఉగ్రమూకతో జవాన్ల వీరోచిత పోరాటంలో ఐదుగురు జవాన్లు మరణించిన ఘటన కలకలం రేపింది. చదవండి : పాకిస్తాన్‌కు సరైన బుద్ది చెబుతాం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement