ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎస్పీ సత్యనారాయణ, ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తదితరులు,మృతి చెందిన చుక్కాలు
సాక్షి, మంచిర్యాల: ఆసిఫాబాద్‌లోని కదంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని పామి డి ప్రాంతానికి చెందిన చుక్కాలు, మరొకరు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాలతిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక బాది రావుగా గుర్తించారు. చుక్కాలు యాక్షన్ టీం సభ్యుడిగా ఉండగా, బాదిరావు 3 నెలల క్రితమే కేబీఎం (కుమురంభీం–మంచిర్యాల) దళంలో చేరాడు. మృతదేహాల వద్ద 9ఎంఎం కార్బన్ ఆటోమేటిక్, 12 బోర్ ఆయుధాలు, రెండు కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, కేం ద్ర కమిటీ లేఖలు, రామజన్మభూమి ప్రతు లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలకు ఆ దివారం సిర్పూర్(టి) ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాదిరావు కు టుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఘ టన స్థలానికి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ, రామగుం డం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఓ ఎస్డీ, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కు మార్‌రెడ్డి, ఏఎస్పీ సుధీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్రావు, కాగజ్‌నగర్ రూరల్ సీఐ సురేందర్ చేరుకున్నారు.
అడెళ్లు కోసం గాలింపు
ఎన్‌కౌంటర్ మృతుల్లో మైలవరపు అడెళ్లుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న వర్గీస్‌తో పాటు మరో మహిళ ఉన్నట్లు తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వారిద్దరు కాదని ఐడీ కార్డుల ద్వారా తేల్చారు. కదంబా అటవీ ప్రాంతంలోనే మరికొందరు దళ సభ్యులు ఉ న్నారనే సమాచారంతో 14 గ్రేహౌండ్స్ బృం దాలు, ఉమ్మడి జిల్లాకు చెందిన 6 స్పెషల్ పా ర్టీ బలగాలతో ప్రాణహిత తీరం నుంచి కౌటా ల, బెజ్జూరు, దహెగాం, నీల్వాయి, చెన్నూరు గోదావరి తీరం వరకు కూంబింగ్ ముమ్మరం గా సాగుతోంది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేఎంబీ దళ నేత అయిన అడెళ్లు అలియాస్ భాస్కర్ కోసం గాలింపు విస్తృతం చేశారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 15 మంది దళంలో చేరినట్లు సమాచారం రావడంతో వారి కోసం గాలిస్తున్నారు. అనుమానితుల ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
2 గంటల పాటు కాల్పులు: ఇన్‌చార్జి ఎస్పీ
కదంబా అడవుల్లో పోలీసులకు, దళ సభ్యులకు మధ్య 2 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఘటన స్థలంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భాస్కర్ దళం సంచరిస్తుందనే సమాచారంతో కూంబింగ్ విస్తృతం చేశాం. 5 రోజుల్లో సిర్పూర్(యూ) మండలం కాకరబుద్ది, తిర్యాణి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో మూడు సార్లు తప్పించుకున్నారు. దీంతో వారి కదలికలను గుర్తించి ముమ్మరంగా కూంబింగ్ చేయగా కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో దళ సభ్యులు తారసపడ్డారు. ఆయుధాలతో ఉన్న వారిని చూసి లొంగిపోవాలని పోలీసులు అంటుండగానే దళ సభ్యులు విచè క్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసు లు వెంటనే పొజిషన్ తీసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసులకు ఎవరికీ గాయాలు కాలేదు. తప్పించుకున్న కీలక సభ్యులు ఇక్కడే కిలోమీటరున్నర పరిధిలోనే ఉన్నారు. వారి కోసం బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి’అని తెలిపారు.
పట్టుకుని కాల్చి చంపారు: మావోలు
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చి న కామ్రేడ్లను పోలీసులు నిర్దాక్షిణ్యంగా పట్టుకుని కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఆదివారం సాయంత్రం కేబీఎం కమిటీ కార్యదర్శి భాస్కర్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. ‘ఈ ఎన్‌కౌంటర్ బూటకం. కామ్రేడ్‌లు చుక్కాలు, బాదిరావులు తమ ప్రాణ త్యాగంతో మరోసారి ఉమ్మడి జిల్లాలో విప్లవ కేతనం ఎగరేశారు. భారత దోపిడీ పాలకులు 2022 నాటికి విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు ఆపరేషన్ సమాధాన్‌తో తెలంగాణలోనూ అణచివేత తీవ్రతరం చేశారు. కార్డన్ సెర్చ్ పేరుతో గ్రామాల్లో సోదాలు, అక్రమ అరెస్టులు చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా చిత్రహింసలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు శిక్షలు తప్పవు’ అని లేఖలో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment