- డీఎస్పీ చిదానందరెడ్డి
గుత్తి: అత్తింటి వారి వేధింపుల కారణంగానే గొందిపల్లి గ్రామానికి చెందిన నవ వధువు ఆదిలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని తాడిపత్రి డీఎస్సీ చిదానంద రెడ్డి తెలిపారు. వివాహిత మృతిపై సోమవారం ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌లో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మృతురాలి తల్లిదండ్రులు నర్సమ్మ, పెద్ద కదిరి, బంధువులను విచారించారు. మృతురాలి భర్త ప్రసాద్, కుటుంబ సభ్యులను కూడా విచారించారు. అనంతరం డీఎస్పీ విలేఖరులతో మాట్లాడారు. కూతురు ఆత్మహత్యకు ఆమె భర్త, అత్తమామల వేధింపులే కారణమని ఆదిలక్ష్మి తల్లిదండ్రులు చెప్పారన్నారు. విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు మీడియాకు చెబుతామన్నారు. కార్యక్రమంలో సీఐ మధుసూదన్ గౌడ్, ఎస్‌ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు పాల్గొన్నారు.