WTC Final: India captain Virat Kohli Said Cricket Won't Stop For Us Even If We Win or Lose This Game - Sakshi
Sakshi News home page

WTC Final: అలా ఎలా డిసైడ్‌ చేస్తారు, అది తప్పు: కోహ్లీ

Published Fri, Jun 18 2021 5:05 PM | Last Updated on Fri, Jun 18 2021 7:25 PM

WTC Final: Win Or Lose This game Does Not Stop Us From Playing Cricket Says Kohli - Sakshi

సౌథాంప్టన్‌: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఓ సాధారణ టెస్ట్‌ మ్యాచ్‌ మాత్రమేనని, ఇందులో టీమిండియా గెలిచినా.. ఓడినా క్రికెట్‌లో కొనసాగక తప్పదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు.  కేవలం ఒక్క మ్యాచ్‌తో ఎవ్వరూ ప్రపంచ ఛాంపియన్లు కాలేరని, ఐదు రోజుల ఆట ఆధారంగా ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ను డిసైడ్‌ చేయడం తప్పని  ఆయన అభిప్రాయపడ్డారు. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా విజయావకాశాలపై స్పందించాడు.

క్రికెట్‌ కూడా ఇతర క్రీడల్లాంటిదేనని, ఇందులోనూ గెలుపోటములు సాధారణమేనని పేర్కొన్నాడు. టీమిండియా ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా, మా క్రికెట్‌ ఇక్కడితో ఆగిపోదని,  అందుకే ఈ మ్యాచ్‌ను మరీ ప్రత్యేకంగా చూడనవసరం లేదని అభిప్రాయపడ్డాడు. టీమిండియా టెస్ట్‌ క్రికెట్‌లో గతకొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తుందని, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా తమ ఫామ్‌ను అలాగే కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు. టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టు సభ్యులంతా కుర్రాలని, నాటి ఆ ఫైనల్‌ మ్యాచ్‌తో పోలిస్తే ఇది మరీ అంత ముఖ్యమైందేమీ కాదని వెల్లడించాడు.

ఇక సౌథాంప్టన్‌లో వాతావరణం తమ జట్టు కూర్పుపై ప్రభావం చేపలేదని, అన్ని విభాగాల్లో సమతూకాన్ని మెయింటైన్‌ చేసి, పటిష్ఠమైన జట్టుతో బరిలోకి దింపుతున్నామని పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టు సభ్యులంతా ఎంతో హుషారుగా ఉన్నారని, ఇదే ఊపులో చక్కగా రాణించాలని ఆశిస్తున్నారని తెలిపాడు. ఫైనల్‌ చేరేందుకు మేమెంత కష్టపడ్డామో అందరు గమనించారని, అయితే అసలు సిసలైన పరీక్ష మాత్రం ముందుందని చెప్పుకొచ్చాడు.

కాగా, ఐసీసీ.. రాత్రికిరాత్రి రూల్స్‌ మార్చడాన్ని కోహ్లీ తప్పుపట్టాడు. ప్రపంచమంతా స్తంభించినప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పద్ధతిని మార్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. కనీసం ఇకనైనా అర్ధ రాత్రుల్లు రూల్స్‌ మార్చొద్దని సూచించాడు. పాయింట్ల విధానం మార్చాక ఫైనల్‌ చేరేందుకు తామెంతో  కష్టపడ్డామని వివరించాడు. అంకితభావం, పట్టుదలతో ఆడి ఈ స్థితికి చేరుకున్నామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మెగా పోరు జరుగనుంది. అయితే ఈ  మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
చదవండి: 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్‌కు దక్కని చోటు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement