Mohammed Azharuddin Slams Virat Kohli And Ravi Shastri.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రాకుండా బుమ్రాను పంపించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ గెలిచినా.. ఓడినా కెప్టెన్ ప్రెస్‌మీట్‌కు రావడం ఆనవాయితీ. కెప్టెన్‌తో పాటు కోచ్ రావడం కూడా సహజంగా కనిపిస్తుంది. ఆటలో ఏం తప్పులు చేశాము.. అవి తర్వాతి మ్యాచ్‌లో రిపీట్ చేయకుండా ఉండేందుకు ఏం చేయాలనేది ప్రణాళిక రచించుకోవాలి. ఒకవేళ కోహ్లి ప్రెస్‌మీట్ రావాలా వద్ద అనేది వదిలేద్దాం. కనీసం కోచ్ పాత్రలో రవిశాస్త్రి అయినా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడితే బాగుండేది. పాపం కోహ్లి, రవిశాస్త్రి తాము కెప్టెన్, కోచ్ అని మరిచిపోయుంటారు అంటూ కామెంట్ చేశాడు.
చదవండి: ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా!
ఇక టీమిండియా న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచినప్పటికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment