భారీ తారాగణం.. 12 ఏళ్ల తర్వాత 'విశాల్‌' సినిమాకు మోక్షం | Actor Vishal And Anjali Madha Gaja Raja Movie Releasing After 12 Years, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

భారీ తారాగణం.. 12 ఏళ్ల తర్వాత 'విశాల్‌' సినిమాకు మోక్షం

Published Fri, Jan 3 2025 11:18 AM | Last Updated on Fri, Jan 3 2025 11:57 AM

Vishal And Anjali Movie Released After 12 Years

విశాల్‌ నటించిన ఒక సినిమా సుమారు 12 ఏళ్ల తర్వాత విడుదల కానుంది. సౌత్‌ ఇండియాలో విశాల్‌ సినిమాలకు మంచి మార్కెట్‌ ఉన్న సమయంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇందులో టాప్‌ నటీనటులు కూడా ఉన్నారు. చిత్రీకరణ కూడా పూర్తి అయింది. అయితే, పలు కారణాల వల్ల సినిమా థియేటర్స్‌లో విడుదల కాలేదు.

హీరో విశాల్‌, ప్రముఖ దర్శకుడు సుంద‌ర్ సి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'మ‌ద‌గ‌జ‌రాజ'. ఈ చిత్రంలో విశాల్‌తో పాటు అంజ‌లి, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ నటించారు. షూటింగ్‌ పనులన్నీ కూడా 2012లోనే పూర్తి అయ్యాయి. ఈ మూవీలో ఐటెంసాంగ్‌లో స‌దా మెరుపులు ఉన్నాయి. ఆపై కోలీవుడ్ హీరో ఆర్య గెస్ట్ రోల్‌లో న‌టించాడు. సోనూసూద్, సంతానం వంటి ప్రముఖులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చాడు. ఇంతటి క్రేజీ కాంబినేషన్‌ ఉన్న ఈ సినిమా విడుదల తేదీని కూడా అప్పట్లో మేకర్స్‌ ప్రకటించారు. అయితే, నిర్మాత‌లు త‌నకు ఇస్తాన‌న్న రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌కుండా ఎగ్గొట్టార‌ని క‌మెడియ‌న్  సంతానం  కోర్టును ఆశ్ర‌యించారు. అక్కడి నుంచి సినిమా విడుదలకు బ్రేకులు పడుతూనే వచ్చాయి.

'మదగజరాజ'కు మోక్షం
సుమారు 12 సంవత్సరాల తర్వాత 'మదగజరాజ'కు మోక్షం దక్కింది. జనవరి 12 విడుదల చేసేందుకు కోలీవుడ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్‌ను విశాల్ తీసుకున్న‌ట్లు తెలిసింది. ఇప్పుడు త‌న బ్యాన‌ర్ మీద‌నే ఈ సినిమాను త‌మిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట. ఈ విషయాన్ని అధికారికంగా విశాల్‌ ప్రకటించనున్నారు. విశాల్‌ అసలు టార్గెట్‌ కోలీవుడ్‌. ఇప్పుడు అజిత్ విడాముయార్చి వాయిదా వేసుకోవడంతో టాప్‌ హీరోలు ఎవరూ రేసులో లేరు. దీంతో ఈ సినిమాకు కాస్త కలెక్షన్స్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. అందుకే ఆయన ఆ ప్లాన్‌ అనుసరిస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement