సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి రీసెంట్‌గా అమరన్ చిత్రంతో అభిమానులను మెప్పించారు. తన పాత్రకు బలం ఉంటే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా ఓకే చెబుతుందని ఆమెకు గుర్తింపు ఉంది. ఒక ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తుందంటే ఆ చిత్రంపై భారీ అంచనాలే ఉంటాయి. సాయి పల్లవి తన కెరీర్ ప్రారంభం నుంచే సెలక్టెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం అందుకుంది.
డాక్టర్ విద్యను పూర్తి చేసిన సాయి పల్లవిలో మొదటి నుంచి ఆధ్యాత్మిక కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కొత్త ఏడాది సందర్భంగా అందరూ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతుంటే సాయి పల్లవి మాత్రం ఆధ్యాత్మికం వైపు వెళ్లింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా మందిరాన్ని ఆమె సందర్శించారు. ఆమె ఇప్పటికే చాలాసార్లు అక్కడికి వెళ్లారు. అయితే, తాజాగా తన కుటుంబంతో కలిసి 'ప్రశాంతి నిలయం'లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయికల్వంత్ మందిరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మానవుడు తనలోని చెడుగుణాలను త్యజించి సత్యనిష్ఠతో జీవిస్తే దైవత్వాన్ని పొందవచ్చనే సందేశాన్ని పూర్వ విద్యార్థులతో కలిసి నాటిక రూపంలో సాయి పల్లవి తెలియజేశారు. 'చెడు త్యజించి అందరూ సన్మార్గంలో పయనించాలని ఆమె కోరారు.
అక్కడ బాబా నామస్మరణ చేస్తూ తనలోని ఆధ్యాత్మికతను ఆమె చాటుకున్నారు. పట్టుచీరలో సంప్రదాయంగా మెరిసిన ఆమె నుదుటన బొట్టుతో సంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి ఆలయంలో కళ్లు మూసుకొని ఆధ్యాత్మికతలో సాయిపల్లవి మునిగిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారడంతో అభిమానులు సాయి పల్లవిని ప్రశంసిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు పార్టీలు, పబ్‌ల పేరుతో ఎంజాయ్ చేస్తుంటే.. ఆమె ఆధ్యాత్మికత వైపు వెళ్లడంతో అభినందిస్తున్నారు.
అమరన్ హిట్ తర్వాత సాయి పల్లవి నటించిన తండేల్ విడుదలకు సిద్ధంగా ఉంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రను నాగ చైతన్య పోషిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. మరోవైపు పాన్ ఇండియా చిత్రం 'రామాయణం'లో ఆమె సీతగా కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ఈ మూవీలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ నటించనున్నారు. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళీ కానుకగా మొదటి భాగం విడుదల కానుంది.
Our Sai Pallavi today evening at Satya Sai's Mangala Aarati program 🥹✨♥️@Sai_Pallavi92 #SaiPallavi #NewYearCelebration pic.twitter.com/KZKncToDwF
— Saipallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) January 1, 2025
Comments
Please login to add a commentAdd a comment