
మలయాళ చలనచిత్రపరిశ్రమలో ఆడవారిని వేధిస్తున్నారని, ఆర్టిస్టులు దుర్భరమైన జీవనం గడుపుతున్నారని జస్టిస్ హేమ కమిటీ బయటపెట్టింది. అయితే ఈ ఒక్కచోటే కాదు దాదాపు ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి సమస్యలున్నాయి. అందుకే తమిళనాట కూడా దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నాడు హీరో విశాల్.
అతడు మాట్లాడుతూ.. అవకాశం కావాలంటే తాము చెప్పినదానికి అంగీకరించమని ఎవరైనా అడిగితే చెప్పు తీసుకుని కొట్టండి. కొందరు ఫోటోషూట్ పేరుతో ఆడవారిని ఆఫీసుకు రమ్మని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇలాంటివి ఎదురైనప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే వెంటనే చెంప చెళ్లుమనిపించాలి. దీని గురించి ఫిర్యాదు చేయాలి. తమిళ ఇండస్ట్రీలోనూ ఇలాంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.
ఇకపోతే విశాల్ నేడు (ఆగస్టు 29న) 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇతడు చెల్లమే మూవీతో వెండితెరపై అడుగుపెట్టాడు. సండకోడి (పందెంకోడి)తో హిట్ అందుకున్నాడు. లాఠీ, మార్క్ ఆంటోని, రత్నం.. తదితర చిత్రాలతో అలరించాడు.
చదవండి: 'నా భర్త అందగాడు.. గతాన్ని మర్చిపో'.. హీరోయిన్‌కు సూచన!