teamindia chances
-
50 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా.. లేక మళ్లీ ఘోర పరాభవం తప్పదా..?
ఓవల్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఇరు జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే చివరి రోజు పది వికెట్లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడంది. మరోవైపు ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఆట థ్రిల్లర్‌ను తలపించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మాత్రం 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది. ఓవల్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. ఆ మ్యాచ్‌లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం. ఆ తర్వాత టీమిండియా 8 మ్యాచ్‌లు ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. వరుసగా 5 మ్యాచ్‌లను చేసుకున్న భారత జట్టు గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) ఘోర పరాజయాలను చవి చూసింది. 2011లో ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. 2014 టూర్లో ఇన్నింగ్స్ 244 రన్స్‌తో చిత్తయింది. 2018 పర్యటనలో 118 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. చదవండి: 'రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది' -
WTC Final: అలా ఎలా డిసైడ్ చేస్తారు, అది తప్పు: కోహ్లీ
సౌథాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఓ సాధారణ టెస్ట్ మ్యాచ్ మాత్రమేనని, ఇందులో టీమిండియా గెలిచినా.. ఓడినా క్రికెట్లో కొనసాగక తప్పదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. కేవలం ఒక్క మ్యాచ్‌తో ఎవ్వరూ ప్రపంచ ఛాంపియన్లు కాలేరని, ఐదు రోజుల ఆట ఆధారంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ను డిసైడ్ చేయడం తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా విజయావకాశాలపై స్పందించాడు. క్రికెట్ కూడా ఇతర క్రీడల్లాంటిదేనని, ఇందులోనూ గెలుపోటములు సాధారణమేనని పేర్కొన్నాడు. టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా, మా క్రికెట్ ఇక్కడితో ఆగిపోదని, అందుకే ఈ మ్యాచ్‌ను మరీ ప్రత్యేకంగా చూడనవసరం లేదని అభిప్రాయపడ్డాడు. టీమిండియా టెస్ట్ క్రికెట్లో గతకొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తుందని, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా తమ ఫామ్‌ను అలాగే కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు. టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టు సభ్యులంతా కుర్రాలని, నాటి ఆ ఫైనల్ మ్యాచ్‌తో పోలిస్తే ఇది మరీ అంత ముఖ్యమైందేమీ కాదని వెల్లడించాడు. ఇక సౌథాంప్టన్‌లో వాతావరణం తమ జట్టు కూర్పుపై ప్రభావం చేపలేదని, అన్ని విభాగాల్లో సమతూకాన్ని మెయింటైన్ చేసి, పటిష్ఠమైన జట్టుతో బరిలోకి దింపుతున్నామని పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టు సభ్యులంతా ఎంతో హుషారుగా ఉన్నారని, ఇదే ఊపులో చక్కగా రాణించాలని ఆశిస్తున్నారని తెలిపాడు. ఫైనల్ చేరేందుకు మేమెంత కష్టపడ్డామో అందరు గమనించారని, అయితే అసలు సిసలైన పరీక్ష మాత్రం ముందుందని చెప్పుకొచ్చాడు. కాగా, ఐసీసీ.. రాత్రికిరాత్రి రూల్స్ మార్చడాన్ని కోహ్లీ తప్పుపట్టాడు. ప్రపంచమంతా స్తంభించినప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పద్ధతిని మార్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. కనీసం ఇకనైనా అర్ధ రాత్రుల్లు రూల్స్ మార్చొద్దని సూచించాడు. పాయింట్ల విధానం మార్చాక ఫైనల్ చేరేందుకు తామెంతో కష్టపడ్డామని వివరించాడు. అంకితభావం, పట్టుదలతో ఆడి ఈ స్థితికి చేరుకున్నామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు భారత్, న్యూజిలాండ్ మధ్య మెగా పోరు జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చదవండి: 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్‌కు దక్కని చోటు -
టీమిండియానే ప్రపంచ ఛాంపియన్.. ఆసీస్ కెప్టెన్ జోస్యం
సిడ్నీ: మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియానే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందని ఆసీస్ టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ జోస్యం చెప్పాడు. తుది సమరంలో ప్రత్యర్ధి న్యూజిలాండ్ కూడా బలమైన జట్టే అయినప్పటికీ.. భారత్‌కే అవకాశలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ మెగా పోరులో టీమిండియా తమ సహజసిద్ధమైన క్రికెట్ ఆడినా న్యూజిలాండ్‌పై అలవోకగా నెగ్గగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా కూడా భారత్‌లాగే బలమైన బ్యాకప్ జట్టును కలిగి ఉండాలని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కాగా, ఇటీవల కాలంలో టీమిండియాపై తరుచూ విమర్శలు చేస్తూ వస్తున్న పైన్, భారత్‌పై సానుకూలంగా స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఆసీస్ గతేడాది స్వదేశంలో భారత్, న్యూజిలాండ్ జట్లతో చెరో టెస్ట్ సిరీస్ ఆడింది. వీటిలో కివీస్‌పై 3-0తేడాతో నెగ్గిన మాజీ ప్రపంచ ఛాంపియన్.. భారత్ చేతిలో మాత్రం 1-2తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న కివీస్‌పై విశ్లేషకులు భారీ అంచనాలు కలిగి ఉన్నారు. కివీస్ జట్టు అన్ని రంగాల్లో భారత్ కంటే పటిష్టంగా ఉందని, మరి ముఖ్యంగా ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులకు కివీస్ ఆటగాళ్లు బాగా అలవాటు పడ్డారని, ఇదే వారి విజయానికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 18న ఐసీసీ టాప్ టూ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. చదవండి: కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్.. షెడ్యూల్ ప్రకటించిన నిర్వహకులు -
పాపం మనీశ్ పాండే.. అవకాశాలివ్వకుండా తొక్కేశారు!
బెంగళూరు: అడపాదడపా భారత జట్టులో కనపడే కర్ణాటక స్టార్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండేపై అతని చిన్ననాటి కోచ్ ఇర్ఫాన్ సేట్ సానుభూతిని వ్యక్తం చేశాడు. మనీష్‌కు తగినన్ని అవకాశాలివ్వకుండా టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని తోక్కేసిందని ఆరోపణలు గుప్పించాడు. అందరు క్రికెటర్లకులా మనీష్‌కు కూడా అవకాశాలు ఇచ్చి ఉంటే, ఈ పాటికే స్టార్ ప్లేయర్ అయ్యేవాడని అభిప్రాయపడ్డాడు. మనీష్ టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల కన్నా బెంచ్‌పై కూర్చున్న మ్యాచ్‌లే ఎక్కువని, జట్టు యాజమాన్యం ఇకకైనా అతనిపై చిన్నచూపు చూడటం మానుకుని, అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. నిజాయతీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలిస్తే మనీష్ గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మనీష్.. పరిణితి చెందిన ఆటగాడని, సవాళ్లను ఇష్టపడతాడని, టెక్నిక్, వేగం కలబోసిన టాలెంట్ అతని సొంతమని ప్రశంసలు కురిపించాడు. అతనిప్పటి వరకు సరైన బ్యాటింగ్ ఆర్డర్లో రాలేదని, పూర్తి స్థాయి సిరీస్‌కు అవకాశమిస్తే తనేంటో తప్పక నిరూపించుకుంటాడని జోస్యం చెప్పాడు. కాగా, 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన మనీష్ పాండే.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. అయితే, తాజాగా శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2009లో డెక్కన్ చార్జర్స్ తరఫున బరిలో నిలిచిన పాండే 73 బంతుల్లోనే 114 సూపర్ శతకాన్ని సాధించి అందరి మన్ననలు పొందాడు. ఆతర్వాత 2016లో ఆస్ట్రేలియాపై 81 బంతుల్లోనే శతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎందుకో ఏమో తెలీదు కానీ మనీష్‌కు ఆతర్వాత అవకాశాలు పలచబడ్డాయి. కాగా, మనీష్ ఇప్పటివరకు 26 వన్డేల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 492 పరుగులు చేశాడు. టీ20ల్లో 33 ఇన్నింగ్స్‌ల్లో 3 అర్ధశతకాల సాయంతో 709 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే మనీష్‌కు ఐపీఎల్లో మాత్రం మెరుగైన రికార్డే ఉంది. ఐపీఎల్లో 151 మ్యాచ్‌ల్లో శతకం, 20 అర్ధశతకాలతో సాయంతో 3461 పరుగులు చేశాడు. చదవండి: లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను.. -
టీమిండియాలో అతని ఎంపికే ఓ వివాదం..
హైదరాబాద్: టీమిండియా డాషింగ్ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపిక అప్పట్లో ఓ పెద్ద వివాదానికి దారి తీసిందని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. 2014లో మాజీ కెప్టెన్ ధోనీ టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా ఎదిగాడని, అతను భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ మెరుగ్గా రాణిస్తున్న తరుణంలో సడన్‌గా రిషబ్ పంత్‌ని తమ బృందం తెరపైకి తెచ్చిందని, దీంతో ఆ సమయంలో తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో పంత్ టెస్టులకు పనికిరాడని, అతని దూకుడు టెస్ట్ ఫార్మాట్‌కు సరిపోదని, కీపింగ్ విషయంలో ఫిట్నెస్ విషయంలో అలక్ష్యంగా ఉంటాడని అతనిపై అనేక రకాల విమర్శలు వచ్చాయని, అయినా పంత్ వాటన్నింటిని అధిగమించి రాటుదేలాడని ఎమ్మెస్కే చెప్పుకొచ్చారు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత పంత్ ఘోరంగా విఫలమయ్యాడని, అయితే గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో తిరుగులేని ప్రదర్శన కనబర్చాడని, ఆ తర్వాత ఇంగ్లండ్‌పైనా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పంత్.. భారత్‌లోని టర్నింగ్ పిచ్‌లపై సైతం చక్కగా కీపింగ్ చేస్తున్నాడని, ఛాలెంజింగ్ కండీషన్లలో కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సెలెక్టర్‌గా ప్రతిభని గుర్తించడం తన బాధ్యతని, అందులో భాగంగానే పంత్ ఎంపిక జరిగిందని, తన నమ్మకాన్ని పంత్ వమ్ము చేయలేదని తెలిపాడు. రెండేళ్ల కిందట చాలా మంది పంత్ ఈ స్థాయిలో రాణిస్తాడని ఊహించలేదని, అతన్ని విమర్శించిన వారే నేడు అతన్ని అందలం ఎక్కిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ గడ్డపై ఈ నెల 3న అడుగుపెట్టిన భారత జట్టు.. జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా జరిగే డబ్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ టూర్‌కి రిషబ్ పంత్ టీమిండియా ఫస్ట్ ఛాయిస్ కీపర్‌గా ఎంపికయ్యాడు. చదవండి: భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్.. కారణం తెలిస్తే షాక్ -
ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు..
న్యూఢిల్లీ: దేశవాళీ స్టార్ ఆటగాడు, ప్రస్తుత రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ కు సంబంధించిన సంచలన విషయాలను సౌరాష్ట్ర కోచ్ కర్సన్ గావ్రి వెల్లడించాడు. టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్, 7 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఉనద్కత్ .. ఇకఫై ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడని, ఈ విషయాన్ని సాక్షాత్తు బీసీసీఐ సెలెక్టరే తనతో చెప్పాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2019-20 రంజీ సీజన్లో ఏకంగా 67 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రను తొలిసారి ఛాంపియన్ గా నిలబెట్టిన 30 ఏళ్ల ఉనద్కత్ పై సెలెక్టర్లు ఇలాంటి అభిప్రాయాన్ని కలిగివుండటాన్ని ఆయన తప్పు బట్టాడు. వయసును బూచిగా చూపి ఉనద్కత్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేకపోవడమన్నది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. రంజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (ఒక సీజన్లో) సాధించిన ఆటగాడిని కనీసం భారత 'ఏ' జట్టులోకి కూడా తీసుకోకపోవడం బాధాకరమన్నాడు. దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించి పెడుతుందని ఉనద్కత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, వాటిపై సెలెక్టర్లు నీళ్లు చల్లేలా ఉన్నారని విచారం వ్యక్తం చేశాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు ఉనద్కత్ ను ఎంపిక చేస్తారని తానూ కూడా ఆశగా ఎదురు చూశానన్నాడు. ఉనద్కత్ తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ను 2010లో ఆడాడని, అప్పటి నుంచి జట్టులో స్థానం కోసం కఠోరంగా శ్రమించాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఫాస్ట్ బౌలర్లలో షమీ, సైనీ, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు. చదవండి: రోహిత్ భాయ్ వల్లే ఐపీఎల్ ఎంట్రీ.. అంతా అతని చలువే -
ఆ వాటమే తనకు అవకాశాలు తెచ్చిపెట్టింది: నట్టూ
చెన్నై: ఏదో ఒక ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తే చాలనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, నెట్ బౌలర్‌గా ఎంపికై ఏకంగా మూడు క్రికెట్ ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేశాడు ఈ సేలం కుర్రాడు. అంతే కాదు తన బౌలింగ్ ప్రతిభతో మూడు ఫార్మట్లలోనూ రాణించి టీమిండియాకు భవిష్యత్తు ఆశా కిరణంలా మారాడు. అతడే తమిళనాడుకు చెందిన టి నటరాజన్. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ అయిన నట్టూ.. తాను ఎడమ చేతి వాటం బౌలర్‌ను కావడమే కలిసొచ్చిందని అంటున్నాడు. ప్రస్తుతం సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బౌలర్లలో ఎక్కువ మంది కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని, ఎడమ చేతి వాటం బౌలర్‌ని కావడమే తనకు మూడు క్రికెట్ ఫార్మాట్లలో చోటు సంపాదించిపెట్టిందని నట్టూ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలో రాణించడానికి తాను ఎంతో కఠోరంగా శ్రమించానని, కేవలం శ్రమను మాత్రమే తాను నమ్ముతానని నట్టూ తెలిపాడు. నెట్స్‌లో తాను శ్రమించడాన్ని గుర్తించిన కోచ్, కెప్టెన్లు తన బౌలింగ్‌పై పూర్తి నమ్మకంతో తనకు మూడు ఫార్మట్లలో ఆడే అవకాశాన్ని కల్పించారన్నారు. అన్ని ఫార్మట్లలో తుది జట్టులోకి తన ఎంపిక మాత్రం కేవలం ఎడమ చేతి వాటం బౌలర్‌ను కావడం వల్లనే జరిగిందని నట్టూ చెప్పుకొచ్చాడు. కాగా, ఆసీస్ పర్యటనకు నట్టూ కేవలం నెట్ బౌలర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. జట్టు సభ్యులు ఒక్కొక్కరిగా గాయాల బారినపడటంతో అతనికి భారత జట్టులో స్థానం లభించింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న నట్టూ..మూడు ఫార్మట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గబ్బాలో జరిగిన తన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్, మాథ్యూ వేడ్‌ల వికెట్లతో సహా మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్శించాడు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సేలం క్రికెట్ అసోసియేషన్‌కు తానెంతో రుణపడి ఉన్నానని, భవిష్యత్తులో సేలం క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని నట్టూ హామీ ఇచ్చాడు. -
భారత్ ఫైనల్ ఆశలు సజీవం
హొబర్ట్: ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్ ఫైనల్ కు వెళ్లే ఆశలు సజీవంగా ఉన్నాయి. శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక ఇంగ్లండ్, భారత్ జట్లలో ఒకటి ఫైనల్ కు చేరనుంది. ఇంగ్లండ్ ఇప్పటికే ధోనిసేనపై బోనస్ పాయింట్ తో విజయం సాధించినందున ఆ జట్టుకే అవకాశం ఎక్కువ ఉంది. అయితే టీమిండియాకు దారులు పూర్తిగా మూసుకుపోలేదు. టీమిండియా తర్వాత ఆడాల్సిన రెండో వన్డేల్లో విజయం సాధిస్తే తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. సిడ్నీలో 26న జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. 30న పెర్త్ లో జరిగే మరో మ్యాచ్ లో ఇంగ్లండ్ తో ధోనిసేన పోటీ పడుతుంది. ఫిబ్రవరి 1న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.