న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అనర్హత వేటు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ధ్వజమెత్తారు.
తాను దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను.. పోరాడుతానని స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు వేసినా, జైలుకి పంపినా భయపడేది లేదని.. ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. అదానీ , మోదీ స్నేహం గురించి పార్లమెంట్‌లో మాట్లాడాడని.. వీరిద్దరి బంధం, ఇప్పటిది కాదు ఎప్పటినుంచో ఉందన్నారు.
‘నిబంధనలు మార్చి ఎయిర్‌పోర్ట్‌లు అదానీకి ఇచ్చారు. నేను విదేశీ శక్తుల నుంచి సమాచారం తీసుకున్నానని కేంద్రమంత్రులు పార్లమెంటులో అబద్ధం చెప్పారు. నేను రెండు లేఖలు రాస్తే.. వాటికి జవాబుల లేదు. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారు. నేను ఒకటే ప్రశ్న అడిగాను. అదానీ షెల్ కంపెనీలో 20 వేల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారని..ఆ డబ్బు ఎవరిదని ప్రశ్నించాను’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు.. సెప్టెంబర్‌లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక?
Comments
Please login to add a commentAdd a comment