
రేపు అఖిలేశ్, రాహుల్ ప్రెస్‌మీట్
లక్నో: యూపీ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్న సమాజ్‌వాదీ పార్టీ నేత, సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఆదివారమిక్కడ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. పొత్తుపై ప్రజల్లో ఉన్న గందరగోళానికి తెరదించనున్నారు. ఇద్దరు నేతలు కలసి విలేకర్ల సమావేశం మాట్లాడితే ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుతుందని రెండు పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి.