
సరదాగా...
‘హీరో’ సానియా
సెలబ్రిటీల దుస్తుల మీద రకరకాల కామెంట్స్ రాసి ఉంటాయి. కొందరు సరదాగా, కొందరు స్ఫూర్తి పెంచేలా, కొందరు సందర్భాన్ని బట్టి రకరకాల టీ షర్ట్‌లు వాడుతుంటారు. వింబుల్డన్ గెలిచి హైదరాబాద్ రాగానే సానియా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
సాధారణంగా మోడ్రన్ దుస్తుల్లోనే మీడియా ముందుకు వచ్చే సానియా ఈసారి సింపుల్‌గా ఓ టీషర్ట్ ధరించి వచ్చింది. దాని మీద పెద్ద అక్షరాలతో హీరో అని రాసి ఉంది. తన విజయం దేశంలోని మహిళల్లో మరింత స్ఫూర్తి పెంచాలని సానియా వ్యాఖ్యానించింది. బహుశా అదే సందేశం తన దుస్తుల ద్వారా ఇవ్వాలనుకుందేమో. ఏమైనా వరుస విజయాలు సాధిస్తున్న ఈ హైదరాబాదీ భారత్‌లో ‘హీరో’నే..!