
క్రికెట్‌లో ఒక సిరీస్ ప్రారంభానికి ముందు కెప్టెన్లు మీడియా ముందుకు రావడం ఆనవాయితీ. జట్టు కాంబినేషన్, గేమ్ ప్లాన్, విన్నింగ్ స్ట్రాటజీ, బ్యాటింగ్ ఆర్డర్ సహా మరికొన్ని విషయాలు గురించి కెప్టెన్ వివరించడం చూస్తుంటాం. ఇదే తరహాలో శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ కూడా మీడియా ముందుకు వచ్చాడు. మాములుగానే మీడియాతో మాట్లాడేటప్పుడు ఫన్ క్రియేట్ చేయడంలో ముందుండే రోహిత్ మరోసారి రెచ్చిపోయాడు.
విషయంలోకి వెళితే.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక విలేకరి.. ఔట్ ఫీల్డ్‌లోనే మీరు మ్యాచ్ ఆడబోతున్నారా.. అసలు పిచ్ గురించి ఏం మాట్లాడడం లేదు అని ప్రశ్నించాడు. దీనికి రోహిత్ కాస్త భిన్నంగా స్పందించాడు. '' అసలు ఈ మధ్యన ఒక్కరు సరైన ప్రశ్నలు వేయడం లేదు. మీరు అడిగినది వాస్తవానికి మంచి ప్రశ్న. అంతేకాదు పిచ్ గురించి కానీ, జట్టు కాంబినేషన్ గురించి, ప్రేక్షకుల గురించి ఒక్కరు కూడా అడగడం లేదు. మీరు అడగకపోవడం కూడా ఒక రకంగా మంచిదే.. అన్ని విషయాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు వస్తుండడం నాకు సంతోషం కలిగించింది'' అంటూ పేర్కొన్నాడు. దీంతో నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక రోహిత్ శర్మకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్. కోహ్లి టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్‌కు స్వదేశంలోనూ ఇదే తొలి సిరీస్. కోహ్లి కూడా లంకతో తొలి టెస్టు ద్వారా వందో టెస్టు మ్యాచ్ ఆడనుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది.
చదవండి: Dewald Brevis: జూనియర్ ఏబీ క్రికెట్ రూంలో ఆశ్చర్యకర విషయాలు
IND vs SL 1st Test: నెట్స్‌లో చెమటోడ్చుతున్న హిట్‌మ్యాన్.. ఫోటోలు వైరల్
💬 💬 We want to make the occassion special for @imVkohli: #TeamIndia Captain @ImRo45 #INDvSL | @Paytm | #VK100 pic.twitter.com/NOxk0bTRr8
— BCCI (@BCCI) March 3, 2022
.@ImRo45 😂pic.twitter.com/xKXNPaA4gi
— Manojkumar (@Manojkumar_099) March 3, 2022