
జీవితాంతం జగన్ వెంటే..
జీవితాంతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తానని, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తన కోరికని...
ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది నా కోరిక
నెల్లూరు: జీవితాంతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తానని, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తన కోరికని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోటకు వచ్చిన ఆయన కుటుంబసభ్యులతో కలసి కోటమ్మ దేవాలయంలో పూజలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన చివరిశ్వాస వరకూ వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్నారు. పార్టీలో సాధారణ కార్యకర్తగా పనిచేస్తానన్నారు. కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.