శాయంపేట మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారని వైఎస్సార్ సీపీ మండల ....
శాయంపేట : శాయంపేట మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారని వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి మారపల్లి సుధాకర్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. శాయంపేటకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూపాలపల్లిలో కలపకుండా వరంగల్ జిల్లాలోనే కొనసాగించేలా స్పీకర్, భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి చొరవ తీసుకోవాలన్నారు.
రాజకీయ లబ్ధి కోసం ఒక్కసారి మండలాన్ని భూపాలపల్లిలో కలిపితే జీవితాంతం మండల ప్రజలు బాధపడుతారన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా వారి అభిప్రాయం మేరకు మండలాన్ని వరంగల్ జిల్లాలో కొనసాగించేలా స్పీకర్ బహిరంగ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మారపల్లి సుదర్శన్, అల్లె అర్జున్ పాల్గొన్నారు.